రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 20:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతి సందర్భంగా మెదక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 1984 నుండి 1989 వరకు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండి యువతకు నిరుద్యోగ సమస్య పై ఆయన పోరాడి ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.మన దేశ అభివృద్ధికి మొట్టమొదటిసారిగా ఐటీ రంగాన్ని పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు.రాజీవ్ గాంధీ ఆశయాలతో ముందుకు సాగడం వల్ల ఐటీ అభివృద్ధి చెందిందని తెలిపారు. అదేవిధంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇతర రాజకీయ నాయకులు కూడ ఆయన చొరవతో ముందుకు సాగారని పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ నిర్వీర్యంగా కొనసాగుతుండంతో ఆయన ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి గ్రామాలలో అధికారాలు ఉండాలని దాంతో ఆయన ముందుకు తీసుకెళ్లారని అన్నారు.ఇప్పటికి కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను అన్ని ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,డాకి స్వామి, విప్లవ్ కుమార్, సేవాదల్ అధ్యక్షుడు జహీర్, బైరం కుమార్,సుంకోజు దామోదర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.