అరుణమాఫీ పేరుతో మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు: బీజేపీ నేత గడ్డం శ్రీను
నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట ప్రతినిధి:
చండ్రుగొండ మండల రైతు వేదికలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో రైతులు ఆందోళనకు దిగారు. రెండు లక్షల లోపు రుణాలు కూడా మూడు విడతల్లో మాఫీ కాలేదని బీజేపీ మండల నాయకుడు గడ్డం శ్రీను దుయ్యబట్టారు. రెండు లక్షలు దాటిన పై మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ వస్తుందని రైతులకు ఆశపెట్టి మోసం చేశారని తెలిపారు. రెండు లక్షల పైనున్న మొత్తాన్ని సదరు రైతులు బ్యాంకుల్లో చెల్లించారని అయినా అప్డేట్ కాలేదంటూ సమాధానం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ విధానాలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. రైతుల నుంచి ఆందోళనలు ఉదృతం కాకుండా ఉండేందుకే ఈ గ్రీవెన్స్ నాటకాలని చెప్పారు. ఈ ప్రజా ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదా అని ప్రశ్నించారు. అరుణమాఫీ చేయాలనుకుంటే రైతు అప్పులతో సంబంధం ఏంటన్నారు. రెండు లక్షలు మాఫీ చేస్తే మిగతావి రైతు చెల్లించుకుంటారా లేక పునఃప్రారంభించుకుంటారు అన్నారు.రైతులు పెట్టుబడి కోసం కష్టకాలంలో ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఆడుకోకపోగా రైతుల నుంచి డబ్బులు కడితేనే మాఫీ అనడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయడం మాని వెంటనే క్రాప్ లోన్ పేరుతో బ్యాంకుల్లో ఉన్న రైతుల ఖాతాల్లో నిబంధనలు లేకుండా 2 లక్షలు జమ చేయాలని డిమాండ్ చేశారు.