+91 95819 05907

వారివి వెర్రి కూతలు..మావి అభివృద్ధి బాటలు

* రైతు రుణమాఫీ సహా.. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం
* టీ ఎస్ పీఎస్సీ ని ప్రక్షాళన చేశాం
* జాబ్ కేలెండర్ తో నిరుద్యోగులకు అండగా నిలుస్తాం
* రైట్ ఛాయిస్- శీనన్న ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో మంత్రి పొంగులేటి
* గతంలో మాదిరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచన
* మంత్రి పొంగులేటి సేవాభావం అభినందనీయం: ఎంపీ రఘురాం రెడ్డి

నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 21 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షం, దానికి తోడైన మరో విపక్షం వెర్రి కూతలు కూస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. బుధవారం రైట్ ఛాయిస్ ఆధ్వర్యంలో రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న ఉచిత కోచింగ్ క్యాంపును ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా వందలాదిగా హాజరైన నిరుద్యోగ అభ్యర్థులను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రజలు మార్పు కోరుకుని రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని వమ్ము చేసుకోమని తెలిపారు. మేం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31వేల ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. 45 రోజుల్లోనే టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేశామని, పేపర్ లీకేజీలు లేకుండా నిరుద్యోగుల నమ్మకొన్ని పొందామని అన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని రూ.31వేల కోట్లతో అమలు చేస్తున్నామని తెలిపారు.
*నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంది..*
ఈ ప్రభుత్వానికి పేదలు, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పోటీ పరీక్షలను రద్దు చేయించి నిరుద్యోగులను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ వారు, వారి తొత్తు పార్టీ చూస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెన్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు.
*జిల్లాలో త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ బ్రాంచ్ ఏర్పాటు చేయిస్తా*
నిరుద్యోగుల భవితవ్యానికి భరోసా కల్పించేలా హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ను ప్రారంభించుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు మరో వంద మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతారని అన్నారు.
త్వరలోనే జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
*నిరుద్యోగులను తీర్చిదిద్దడంలో మెండెం కిరణ్ మేటి..*
2016 నుంచి రైట్ చాయిస్ అధినేత మెండెం కిరణ్ తనకు తెలుసని రాష్ట్ర రెవెన్యూ ముంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గతంలో నిరుద్యోగుల కోసం పీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ను పెట్టగా.. కిరణ్ పర్యవేక్షణలో 300 మందికి ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం తిరిగి గ్రూప్ పరీక్షలు, ఎస్సై, కానిస్టేబుల్ పోటీ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ నిర్వహించబోతుండడం ఆనందంగా ఉందని తెలిపారు. అందరూ కష్టపడి చదివి, శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు నుంచి పేరు తీసుకురావాలని కోరారు.
*మంత్రి పొంగులేటి సేవాభావం గ్రేట్: ఎంపీ రఘురాం రెడ్డి*
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతుంటారని, అందరి బాగోగులు తెలుసుకుంటూ ప్రజా సేవ చేస్తారని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండడం అరుదని కొనియాడారు. తన విజయంలో ఆయన పాత్ర కీలకమని గుర్తు చేశారు. ఓ ఎంపీగా జిల్లాలోని నిరుద్యోగుల బాగుకు తప్పకుండా సహకారం అందిస్తానని తెలిపారు.
*ఈ కార్యక్రమంలో..* రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, తుళ్లూరి బ్రహ్మయ్య, ప్రొఫెసర్ చింతా గణేష్, జ్యోతి రెడ్డి, కాంగ్రెన్ ఖమ్మం రూరల్ ముండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు మద్ది మల్లారెడ్డి, కిశోర్ రెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భద్రకాళి, హారికా నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !