చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
సంపూర్ణంగా సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు… దళితుల ఐక్యతే ముద్దు… వర్గీకరణ వద్దు
ఇటీవల ఎస్సీ(SC) వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకోవాలని, దీనివల్ల ఎస్సీల్లో విభజన ఏర్పడే అవకాశం ఉందని జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏడెల్లి గణపతి ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్సీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా బుధవారం భారత్ బంద్ కు మాల సామాజిక వర్గం నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మండలంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి తోటమల్ల రమణమూర్తి,రాష్ట్ర నాయకులు కొంగూరు రమణారావు,దొడ్డా ప్రభుదాస్, కొంగూరు నరసింహారావు,కోడి రెక్కల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా విజయవంతం చేశారు.బంద్ నేపథ్యంలో మండల కేంద్రంలోని కాక, మండలంలోని అన్ని గ్రామాలలో భారత్ బంద్ కు ప్రజలు సహకరించారు.ఉదయం నుండే మాల మహానాడు కు చెందిన వందలాదిమంది కార్యకర్తలు,నాయకులు ద్విచక్ర వాహనాలు,ఆటోలతో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తూ వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు, విడిపోతే పడిపోతాం,కలిసి ఉంటే పడగొడతాం అనే నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు.భారత్ బంద్ నేపథ్యంలో వ్యాపార, వర్తక,వాణిజ్య సంస్థలు, విద్యారంగ సంస్థలు,బ్యాంకులు, ప్రైవేట్ రంగ సంస్థలు మూతపడ్డాయి.ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక,కర్షక, శ్రామిక, మహిళా, యువత, విద్యార్థులు, తదితర వర్గాలకు చెందిన ప్రజలు సహకరించడంతో భారత్ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది.ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గణపతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పుని పునపరిశీలించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాలమహానాడు మండల గౌరవ అధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్,మండల అధ్యక్షులు రుంజా రాజా,మాజీ మండల అధ్యక్షులు తోటమల్ల గోపాలరావు,నాయకులు తోటమల్ల విజయరావు,కారంపూడి సాల్మన్,ఇప్పా ప్రభుదాస్,నిట్ట అబ్బులు,తోటమల్ల రవి కుమార్,మైస ప్రభుదాస్,తోటమల్ల కృష్ణారావు, కొంగూరు సత్యనారాయణ, బండి అఖిల్, చీదరగడ్డ వినోద్, రుంజ సోను,చినిగిరి సుధాకర్,రుంజ బాబు, కోడి రెక్కల వెంకట్,బంటు కార్తీక్, నిట్టా రమేష్, కర్రీ చింటూ, అభిషేక్, బండి దాసు, రుంజ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.