రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 21:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ గోల్పర్తి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న శ్రీ భవాని శంకర అన్న ప్రసాద వితరణ సేవ క్షేత్రం శ్రీ శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కన్నోజు నాగభూషణం చారి దంపతుల ఆధ్వర్యంలో బుధవారం రోజు కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద వధూవరుల జంట అయిన మెట్టు స్రవంతి వివాహం ఉప్పరి సాగర్ తో అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా ఈ వివాహం జరిపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడు బీదరికంలో జీవితాన్ని కొనసాగించిన వధూవరుల తండ్రులు ఎప్పుడో పరమపదించారని అన్నారు. ఇలాంటి యువత జీవితాల్లో వెలుగులు నింపాలని ట్రస్ట్ వారు తలంచి ఈ వివాహాన్ని పుర ప్రజల సహాయ సహకారంతో జరిపించామన్నారు.రామాయంపేట ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా కడు బీదరికంలో జీవితాన్ని కొనసాగిస్తు తల్లి తండ్రులను కోల్పోయిన వారు,వివాహ సంబంధాలు కలిసి,ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి స్వయంగా వివాహంను జరిపించంకోలేని వారు ఎవరైనా ఉంటే ట్రస్ట్ వారిని సంప్రదించిన యెడల వివాహమును సాంప్రదాయ బద్దంగా జరిపిస్తామని ఆయన తెలిపారు.నేటి వివాహం జరుపుకున్న జంట వారి నూతన జీవితంలో పిల్లాపాపలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆశీర్వదించారు.ఈ వివాహ కార్యక్రమంలో వధూవరుల బంధుమిత్రులు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.