చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
చర్ల గ్రామం లో (MRPS)కార్యకర్తల అత్యవసర సమావేశంలో (MRPS)జిల్లా నాయకులు మచ్చా. వీర్రాజు మాదిగ మాట్లాడుతూ,
తెలంగాణ ,చత్తిషుగడ్ రాష్ట్ర సరిహద్దుల్లో చర్ల మండలం చెన్నాపురం గ్రామం సరిహద్దుల్లో సరైన కారణాలు చూపకుండా ,దళిత మహిళను మావోయిస్టు పార్టీ హత్య చేయడాని, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మచ్చా వీర్రాజు మాదిగ ఖండించారు. మావోయిస్టు పార్టీ లో దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. దళితులకు, అగ్రకుల రాజకీయ పార్టీలు, సరైన స్థానం కల్పించడంలో విఫలమయ్యారు అనుకుంటే, మావోయిస్టు పార్టీ కూడా దళితులకు రక్షణ లేకుండా పోయిందని మరోసారి రుజువు అవుతున్నది. దళిత మహిళ కుటుంబ సభ్యుల్ని పిలిచి మాట్లాడకుండా, ఆమె చేసిన నేరాలను రుజువు చేయకుండా, నిరూపించకుండా ఇన్ఫార్మర్ అనే నెపంతో ఒక దళిత మహిళను చంపడం చాలా బాధాకరం విషయం. సమాజంలో జరుగుతున్న అన్యాయలను ఎదిరించడం కోసం, ఒక దళిత కుటుంబంలో పుట్టి, బిఎస్సి నర్సింగ్ చేసి, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నమ్మి, సామాజిక న్యాయం కోసం అగ్రకులాల దౌర్జన్యంలను , అన్యాయాలను ఎదిరించడం కోసం, మావోయిస్టు పార్టీలో చేరితే, మావోయిస్టు పార్టీ దళిత మహిళ ప్రాణం తీశారని దళిత సమాజం చింతిస్తున్నది. గతంలో కూడా ములుగు జిల్లా, వాజేడు మండలం, జగన్నాధపురం గ్రామంలో ఇల్లెందుల ఏసు అనే వ్యక్తి కట్టెల కోసం అడవికి వెళ్తే క్రసర్ బాంబు పేలి చనిపోతే మావోయిస్టు పార్టీ పోలీస్ ఇన్ ఫార్మర్ అనే తప్పుడు ప్రకటనలు చేశారు. వాళ్ల కుటుంబానికి కనీసం సానుభూతి కూడా ప్రకటించకుండా దళితుల మీద కక్ష కట్టినట్లు ప్రకటన చేయడం చాలా బాధాకరమైన విషయం. చొప్పాల గ్రామం చెందిన కత్తుల వీరేశంను అనే వ్యక్తిని ఇన్ఫార్మర్ నేపథ్యంతో గతంలో దళితున్ని హత్య చేశారు. పీడిత వర్గాల పక్షాన పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న మావోయిస్టు పార్టీ ,అగ్రవర్ణాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అగ్రవర్ణ నాయకులను వదిలేసి, వాళ్లకి క్షమాభిక్షని పెట్టి, దళితుల్లో చైతన్యం లేదు, దళితుల్ని ఏం చేసినా అడిగేటోళ్లు లేరు, అనే ఒక దృక్పథంతో మావోయిస్టు పార్టీ దళిత మహిళా కమాండర్ బంటి రాదను హతమార్చడం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. బడుగు, బలహీన ,వర్గాలలో వెనకబడిన ఎస్సీ ,ఎస్టీలను చంపడమే మావోయిస్టు పార్టీ సిద్ధాంతమా! అని ప్రశ్నించిన ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మచ్చా వీర్రాజు మాదిగ, అలవాల సతీష్ మాదిగ, మాచ్చ రాజా మాదిగ, తదితరు పాల్గొన్నారు.