+91 95819 05907

రాష్ట్రంలో ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తా.

రాష్ట్రంలో ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తా. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు.
ఉర్దూ జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యను పరిష్కరిస్తా.
వక్ఫ్ భూముల పరిరక్షణకు పాటుపడతా.
ఎమ్మెల్సీ , సియాసత్ ఉర్దూ డైలీ చీఫ్ ఎడిటర్, ఆ మే ర్ అలీ ఖాన్.
ఖమ్మం ఆగస్టు 23 : రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేస్తానని ,ఉర్దూ జర్నలిస్టుల అక్రిడేషన్ల సమస్యను పరిష్కరిస్తానని అదేవిధంగా రాష్ట్రంలోని వక్ఫ్ భూముల పరిరక్షణకు పాటు పడతానని ఎమ్మెల్సీ , సియాసత్ ఉర్దూ దినపత్రిక చీఫ్ ఎడిటర్ అమేర్ అలీ ఖాన్ అన్నారు. శుక్ర వారం హైదరాబాదులో గల ఆయన కార్యాలయంలో ప్రముఖ విద్యావేత్త , న్యాయా నిపుణులు మహమ్మద్ అసద్ , ఉర్దూ సీనియర్ జర్నలిస్టు హఫీజ్ జవ్వాద్ అహమ్మద్ , ఫ్రీలాన్స్ జర్నలిస్టు యం డి. షఫీ యు జమ లు కలుసుకొని , ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహమ్మద్ అసద్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్యాక్రాంత మవుతున్న వక్ఫ్ భూముల పరిరక్షణకు అన్ని జిల్లాలలో సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. ముస్లిం మైనార్టీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలో అనేక మౌలిక సమస్యలు పరిష్కరించాల్సి ఉందని , మైనార్టీ విద్యార్థుల ఈ పాఠశాలలో ఇతర విద్యార్థులతో పాటు సిబ్బంది కూడా ఉండటం మైనార్టీ అనేదానికి అర్థం లేకుండా పోతుంది అన్నారు. ఇందులో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నైనా ముస్లిం మైనార్టీలకు రుణాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ జర్నలిస్ట్ హఫీజ్ జవ్వాద్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ఉర్దూ కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఉర్దూ భాషాభివృద్ధికి ఎలాంటి చర్యలు పాలకులు తీసుకోవడం లేదని చెప్పారు. అదేవిధంగా తెలుగు భాషా పత్రికల తో పాటు సమానంగా ఉర్దూ భాష పత్రికలలో పనిచేసే జర్నలిస్టులకు కూడా సమాన స్థాయిలో అక్రిడేషన్లను పంపిణీ చేసే విధంగా చూడాలన్నారు. వీరి డిమాండ్లపై స్పందించిన అమేర్ అలీ ఖాన్ పై విధంగా స్పందించారు. వీటితోపాటు ముస్లిం మైనార్టీలలో పెరుగుతున్న నిరుద్యోగత పై కూడా దృష్టి సారించాలన్న విజ్ఞప్తి పట్ల ఆయన ఈ సమస్యల సాధనకు ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం ఉందన్నారు. తన పదవీకాలం సుమారు ఆరేళ్ల వరకు ఉంటుందని , అప్పటివరకు ఈ సమస్యలు మొత్తం చిత్తశుద్ధితో కృషి చేస్తానని అమేర్ అలీ ఖాన్ హామి నిచ్చారు. ఈ సందర్భంగా మహమ్మద్ అసద్ , హఫీజ్ జవ్వాద్ అహమ్మద్, యం డి. షఫీ యు జమ లు అమేర్ అలీ ఖాన్ ను పూలమాలలతో , శాలువ కప్పి సత్కరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !