+91 95819 05907

తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అడ్డగోలుగా పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలి

★బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ*

★కమిషనర్ కు వినతి పత్రం అందజేత

మాసాయిపేట నేటి గదర్ ఆగస్టు, 27.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొత్త చైర్మన్ కొలువుదీరిన వెను వెంటనే తూప్రాన్ మున్సిపల్ పరిధిలో అడ్డగొలుగా విపరీతంగా ఇంటి పన్ను, వాణిజ్య భావణాల పన్ను పెంచి యాజమానుల నడ్డి విరుస్తున్నారని తూప్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం తూప్రాన్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు రవీందర్ గౌడ్ నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఖాజా మొహిజిద్దిన్ కు తన ఛాంబర్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొంది రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టించి కొత్త చైర్మన్ కొలువుదీరిన వెను వెంటనే తూప్రాన్ మున్సిపల్ పరిధిలో ఒకే సారి 500 రూపాయల ఇంటిపన్ను ఉన్న స్థానం లో ఏకంగా 15 వేల రూపాయలు టాక్స్ పెంచి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. కొత్త మున్సిపల్ ఏర్పాటు అయిన తర్వాత 5 ఏళ్ల వరకు పన్నులు పెంచకుండా సడలింపు ఇచ్చారనీ, అలాంటి నిబంధన తుంగ లో తొక్కి కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు మాపు ఎరుగడని పాత ఇళ్లకు కని విని ఎరుగని రీతిలో మూడువందల శాతం నుంచి ఐదు వందల శాతం ట్యాక్సీ పెంచి సామాన్య మధ్యతరగతి ఇంటి యాజమానుల నడ్డి విరిచే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా తూప్రాన్ మున్సిపల్ ప్రజల అవసర నిమిత్తం మిని స్టేడియం నిర్మించాలని డిమాండ్ చేశారు. స్టేడియం కోసం మంజూరైన నిధులు పక్కదారి మళ్లించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ హయాంలో స్టేడియం నిర్మించాలని తీర్మానించి నిధులు మంజూరు చేయిస్తే కొత్త చైర్మన్ నిధులు దారి మళ్లించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ తో పాటు కౌన్సిలర్ లు బొంది అరుణ వెంకట్ గౌడ్, భైరం ఉమా సత్య లింగం, తలారి పద్మా మల్లేష్, లావణ్య దుర్గారెడ్డి, బి.అర్.ఎస్ నాయకులు ఎస్.కే. సత్తార్, యూత్ లీడర్ శ్రీకాంత్ చారి, ఏర్పుల బాల్ రాజ్,ఆంజనేయులు, నాగేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, కిషన్, ప్రవీణ్ రెడ్డి, లంబ రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, భావని అంజయ్య యాదవ్ కాయితీ బాపని మాల్దార్ శివ, దేవ తో పాటు తూప్రాన్, అల్లాపూర్, రావెల్లి, పోతారాజ్ పల్లి, పడాలపల్లి, బ్రాహ్మణ పల్లి, వేంకటాపూర్ గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

కాళ్ళకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా తూప్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కాళ్ళకల్ గ్రామంలో తేదీ 16 నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్

Read More »

కోమటిపల్లి 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలి

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 22:- మెదక్ జిల్లా రామాయంపేట 44వ జాతీయ రహదారి పైన ఉన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లే దారి మలుపు వద్ద పలుమార్లు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని విద్యార్థుల

Read More »

వెంకటాపురం( నూగుర్ ) మండలంలో ముత్తారం గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎక్కడ ?

*కొండాయి ఆశ్రమ పాఠశాలలో మద్యం సేవించి వస్తున్న ఉపాధ్యాయులను విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి* *తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం టిఏవిఎస్ జిల్లా నాయకులు సోడి అశోక్* *ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి జాగటి రవితేజ*

Read More »

ములుగు జిల్లా కలెక్టర్ ను కలిసిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 22: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ కలిసి వినతి పత్రం అందించిన ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్

Read More »

తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,,

రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ అనుబంధంతో స్వేచ్చ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక,, అధ్యక్షులుగా సామల ప్రవీణ్ ఏకగ్రీవ ఎన్నిక చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ భద్రాది కొత్తగూడెం జిల్లా,చర్ల

Read More »

సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత గ్రామ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య మరణ వాగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకున్న సాయి రెడ్డి Post Views: 19

Read More »

 Don't Miss this News !