ఖమ్మం కలెక్టరేట్ వద్ద రుణమాఫీ పై రైతు సంఘాల ధర్నా. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం కలెక్టర్ వద్ద నేడు రైతు సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా వద్దకు వెళ్లి రైతు సంఘం నేతలకు,రైతులకు రుణమాఫీ పై స్పష్టత ఇచ్చిన మంత్రి తుమ్మల.రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహ పడొద్దు. కుటుంబ నిర్దారణ కానీ రైతులు ఇళ్లకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారు.రైతులు ఇంటి వద్దే కుటుంబ నిర్దారణ చేసి వివరాలు యాఫ్ లో అప్ లోడ్ చేస్తారు.బ్యాంక్ ల్లో మొత్తం 42 లక్షల రైతులు 31 వేల కోట్లు అప్పు ఉన్నారు.రెండు లక్షల రుణమాఫీ 18 వేల కోట్లు రైతులు ఖాతాల్లో జమ చేస్తాం.రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతుల రుణమాఫీ పై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటాం. గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ పై కాగ్ నివేదిక లో వాస్తవాలు వెల్లడయ్యాయి. రైతులను గందర గోళం చేసే పనులు చేయొద్దు.సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానం చేసినట్లు 31 వేల కోట్లు రుణమాఫీ చేసి తీరుతాం అని మంత్రి తుమ్మల అన్నారు.