*మాసాయిపేట మండల కేంద్రంలో కేంద్రంలో విషాదఛయాలు .*
ఈత సరదా ఇద్దరు ప్రాణాలు బలి
మాసాయిపేట మండలం నేటి గద్దర్ ఆగస్టు 28.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. మాసాయిపేట గ్రామానికి చెందిన డప్పు నవీన్, 22 సం, తండ్రి బాల పోచయ్య. నెల్లూరీ రాము 26 సం, తండ్రి భాగయ్య. వారితోపాటు మరో యువకుడు శేషుని రాజు ముగ్గురు యువకులు కలిసి మంగళవారం గ్రామ శివారులోని ఒక క్వారీ గుంతలో నీటిలో స్నానానికి వెళ్లారు. అయితే ఇద్దరు యువకులు నీటిలో దిగగా గల్లంతు కాగా అతనితో పాటు ఉన్న మరో యువకుడు శేషుని రాజు 24 సం, వీరిద్దరూ మునిగిపోవడంతో గట్టుపైనే ఉన్న రాజు వాళ్ళ కుటుంబ సభ్యులకు బుధవారం నాడు విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను గజ ఈత వాళ్ల సహాయంతో గాలింపులు చేపట్టగా ఒక యువకుడు మృతదేహం లభించింది మరో యువకుడి కోసం గజ ఈత వాళ్ల సహాయంతో మరో మృతదేహాన్ని వెతికి తీశారు. ఘటన స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీరి ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో విషయం తెలుసుకున్న మాసాయిపేట మండలం కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని కాంగ్రెస్ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి తెలుపగా తక్షణమే స్పందించిన రాజిరెడ్డి ఒక్కో కుటుంబానికి 5000 చొప్పున రెండు కుటుంబాలకు 10,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది.