+91 95819 05907

మెదక్:చదరంగం క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించి ఆదుకోవాలి పల్లె అంకిత గౌడ్

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 28:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన చదరంగం క్రీడాకారిణి పల్లె అంకిత గౌడ్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ దేశానికి, పుట్టిన గడ్డకు పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారు.అయితే గత ప్రభుత్వం ఆమెను ప్రోత్సహించకపోవడంతో సొంతంగానే వివిధ దేశాలకు వెళ్లి చదరంగం పోటీల్లో పాల్గొని పలు పథకాలు సాధించారు.స్థానిక మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన పల్లె రామచంద్రం గౌడ్ కుమార్తె అంకిత గౌడ్ ప్రపంచ చదరంగం క్రీడాకారిణి పల్లె అంకిత గౌడ్ స్కూల్, కాలేజీ,యూనివర్సిటీ టోర్నమెంట్లో పలుమార్లు పాల్గొని ప్రతి దాంట్లో సెలక్షన్ అవ్వుకుంటూ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తరఫున రెండుసార్లు నేషనల్ సెలెక్ట్ అవడం జరిగింది.యూనివర్సిటీ ఇంటర్నేషనల్ తరఫున కూడా పాల్గొనడం విశేషం.అంకిత గౌడ్ ఎల్లో రేటింగ్ 2000 ప్లస్ ఉంటుంది.రేటింగ్ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మహిళల్లో కూడా చాలా తక్కువగా ఉంటారు.డబ్బుతో కూడుకున్నది కావడంతో ఎక్కువ మంది క్రీడాకారులు రాణించలేకపోతున్నారు.ఎక్కువ టోర్నమెంట్లకు,ఎంట్రీ ఫీజులు, విదేశీ పర్యటన దేశంలో కూడా టూర్లు పోవడానికి అంకిత గౌడ్ సొంత ఖర్చులతో పాల్గొనడం జరుగుతుంది.చదరంగం పోటీల్లో రాణించడానికి కోచింగ్ కు గంటకు సుమారుగా1000 రూపాయల పైనే ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుందనీ అంకిత గౌడ్ నాన్న పల్లె రామచంద్ర గౌడ్ తెలిపారు.విదేశీ పర్యటనలో భాగంగా ఇప్పటివరకు యూరప్ టోర్నమెంట్స్, సెర్బియా విదేశీ పర్యటనలు సుమారుగా 8 దేశాల్లో అంకిత గౌడ్ పాల్గొన్నారు.కామన్వెల్త్ ప్రోగ్రాంలో కూడా ఆమె పాల్గొనడం జరిగినది.గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళిన వారు చాలా తక్కువ మంది ఉంటారు.వీరందరికీ ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వాలని ఆమె కోరారు.గత ప్రభుత్వాలు కొంతమంది క్రీడాకారులకు భూములు,ఆర్థిక వనరులు కల్పించడం జరిగిందని,కొంతమందిని ప్రోత్సహించడం జరిగిందని,అది కూడా ఒకరిద్దరికి మాత్రమేనని రామచంద్ర గౌడ్ తెలిపారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తక్కువ ఉన్న వారికి కూడా ప్రోత్సహించడం జరిగిందని,ప్రతి ఒక్క క్రీడాకారున్ని ప్రోత్సహించి,ఉన్నతంగా ఉన్న వారికి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు.అలాగే అన్ని క్రీడలకు ప్రోత్సహించి,వారికి సపోర్ట్ గా ఉండాలని, క్రీడా చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని,స్కూల్లో ప్రతి ఒక్కరు పాల్గొన్నాలని ఆయన కోరారు.ప్రభుత్వం ప్రోత్సహించే రకంగా క్రీడాకారులకు భూములను ,ఫ్లాట్లను, ఆర్థిక వనరులు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమేనా? ప్రభుత్వం ఆ పని చేయాల్సిందే.

★కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకమే ? ★మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో ★కొత్త బొగ్గు గనులకు విస్తరణ అనుమతులు ఇవ్వాలి ★భూ నిర్వాసిత యువతకు సింగరేణి ఓబీ కంపెనీ

Read More »

పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా… పే బ్యాక్ టు యువర్ సొసైటీ ఆధ్వర్యంలో… మాదిగ వృత్తి చేస్తున్న పేద కుటుంబానికి ఆర్థిక వితరణ… నేటి గదర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి మణుగూరు

Read More »

CPIML మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ కి కొండా చరణ్ రాజీనామ

cpiml ప్రజాపంధ పార్టీ నాకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇంతకాలం పనిచేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పై పైకమిటి మరియు నా తోటి కార్యకర్తల సహకారంతో పార్టీలో నా

Read More »

చిన ముసిలేరు ZPHS లో హిందీ టీచర్ ను తక్షణమే నియమించాలి.(GSP)రాష్ట్ర అధ్యక్షులు. పాయం

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ చర్ల మండలం శుక్రవారం నాడు ఎం ఈ ఓ ఆఫీసులో రాజుకు మెమోరాండం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్తు అధ్యక్షులు. చర్ల మండలంలో చిన మీడిసిలేరు హైస్కూల్లో గత

Read More »

ఆర్టీసీ బస్సు,బైక్ ఢీకొని వ్యక్తి మృతి మరొక వ్యక్తి కి తీవ్ర గాయాలు.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 22: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు. కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొని ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర

Read More »

సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్…10 మంది మావోయిస్టులు హతం.

చత్తీస్ ఘడ్:నవంబర్ 22 ఛత్తీస్‌ఘడ్‌లో రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,సుక్మా జిల్లా లోని దండకారణ్యంలో మావోయిస్టులు సమావేశ మయ్యారనే పక్కా సమాచారంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రత దళాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు

Read More »

 Don't Miss this News !