+91 95819 05907

కోమటిపల్లి మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు సఖికేంద్రం అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 28:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ పాఠశాలల నందు సఖి కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎం.కళావతి తెలిపారు.ఈ సందర్భంగా నందు గృహహింస, వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మికులు, మానవ అక్రమ రవాణా, యాసిడ్ దాడులు, అత్యాచారాలు ప్రేమా ప్రలోభాలు వలన చాలావరకు మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ కేసులు ,ఫోక్స్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు.వీటి వలన అమ్మాయిలను,మహిళలను అక్రమ రవాణా చేసి వ్యభిచార గృహాల్లోకి అమ్మి వేస్తున్నారని అదేవిధంగా అబ్బాయిలను కర్మాగారాలు, బాల కార్మికులుగా మారుస్తున్నారన్నారు.పిల్లలకు చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం వలన కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని బాల్య వివాహాల నిషేధ చట్టం గురించి తెలపడం జరిగిందన్నారు.మరియు బాలబాలికలు అక్రమ రవాణా చేసి ప్రమాదాలకు గురి చేస్తున్నారన్నారు.ఈ ప్రమాదాలు ఎక్కడివారి నుండో కాకుండా మనకు తెలిసిన వారే నమ్మించి మోసం చేస్తున్నారని అన్నారు.మరియు చిన్న చిన్న వస్తువులకి ప్రలోభ పడకూడదని ప్రేమ ఆకర్షణ తేడాలు,ఏది గుడ్ టచ్,ఏది బ్యాడ్ టచ్ అనేది పిల్లలు అవగాహన కలిగి ఉండాలన్నారు.సెల్ ఫోన్ వాడకం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా కనబడుతున్నాయని తద్వారా సైబర్ క్రైమ్ వంటివి జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని బాల బాలికలకు ఫోక్సో యాక్ట్ గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మరియు సఖికేంద్రం, బాలికలు, మహిళల సమస్యలు పరిష్కరించుకోవడానికి సఖి కేంద్రం 24 గంటలు ఓకే పై కప్పు క్రింద సమీకృతంగా 5 రకాల ఉచిత సేవలు అందిస్తుందన్నారు.సఖి కేంద్రం వారు బాధిత మహిళ గాయాలతో వచ్చినప్పుడు మెడికల్ సపోర్ట్ మరియు సైకో సోషల్ కౌన్సిలింగ్, లీగల్ కౌన్సిలింగ్ (మహిళలకు బాలికలకు ఉన్న చట్టాల పై) పోలీస్ సపోర్ట్, బాధిత మహిళకు కుటుంబ సపోర్టు లేకుండా ఎక్కడికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారికి తాత్కాలిక వసతి,గృహహింస జరిగినప్పుడు రెస్క్యూ వెహికల్ వచ్చి కావాల్సిన సహకారాన్ని అందించడం జరుగుతుందన్నారు. మహిళలకు, బాలికలకు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 181,112,1098,18004198588,1930 మొదలెగున్న టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి సఖి కేంద్రం నుండి,కేస్ వర్కర్ ఎం.కళావతి , మరియు పారామెడికల్ మంజుల, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం కేజీబీవీ ఎస్ఓ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !