◆ప్రతి వాహన దారులకు వాహనాల పేపర్లు కలిగి ఉండాలి*
◆మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు ఎస్ఐ రాజేందర్
నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని పెట్రోల్ బంకు సమీపంలో ప్రధాన రహదారిపై కరకగూడెం ఎస్ఐ రాజేందర్ తన సిబ్బందితో కలిసి కరకగూడెం నుండి మణుగూరు, మణుగూరు నుండి కరకగూడెం వైపు వస్తున్న ప్రతి వాహనాన్ని నిలిపి వాహనాల కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించి,కాగితాల గడువు అయిపోయిన వారిని మరల రేన్యూవల్ చేయించుకోవాలని వారికి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా కలిగి ఉండాలని అలాగే ఎవ్వరైన మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి ఎదైన ప్రమాదాలు సంభవిస్తే వాహనాల ఓనర్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పోలీసు వారు ఎప్పుడైనా,ఎక్కడైనా వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీస్ వారిని చూసి పారి పోకుడదని,ద్విచక్ర వాహన దారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.