అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ..
నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 28 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలుకలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం కూసుమంచి ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ మధు సూదన్ నాయక్, డీఈవో సోమశేఖర శర్మ, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వంటగదిని పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయలను భోజనం తయారీకి వినియోగించాలన్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాలు అర్థం కాకపోతే తిరిగి అడగాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను రెండు రోజుల్లో డిప్యూటేషన్ పై పంపనున్నట్లు తెలిపారు. డీఆర్డీఏ పీడీ ఏఏపీసీ పనుల పురోగతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎం శ్రీనివాస్,కూసుమంచి ఉన్నత పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు రేల విక్రమ్ రెడ్డి , ఎంపీఎం సత్యవర్ధన్ రాజు, సీసీలు నవీన్ బాబు, కృష్ణయ్య , శ్రీను, రాంబయమ్మ, వీవో అధ్యక్షురాలు సీత, భారతమ్మ , గ్రామదీపికలు రమాదేవి, రమణ, శిరీష, మల్లిక తదితరులు పాల్గొన్నారు.