నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రనికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి మరియు రోడ్లు భవనాల శాఖ మంత్రులు మర్యాదపూర్వకంగా కలసి వ్యవసాయం గురించి మరియు రోడ్డు విస్తరణల గురించి పలు సలహాలును తుమ్మల ద్వారా తెలుసుకున్నరు.ఉత్తరప్రదేశ్ రాష్టంలో చేయగల వ్యవసాయ అభివృద్ధి పనులు గురించి వారు పలు విషయాలు చర్చించారు. అలాగే రోడ్ల విస్తరణ ధ్వారా రవాణా సదుపాయంను పెంచి పలు అంతర్జాతీయ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే సలహాలు వారు మంత్రి తుమ్మలను అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్య ప్రతప్ సహి మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బలదేవ్ సింగ్ ఔలాఖ్ లు పాల్గొన్నారు. వారిరువురికి మంత్రి తుమ్మల శాలువా కప్పి సన్మానించారు.