నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్:
✍️కొత్త దామోదర్ గౌడ్, నేటి గదర్ సిఇఓ
లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 164 రోజులు జైలు జీవితం గడిపి ఈనెల 27న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన విషయం విధితమే. మార్చి 14న ఆమె యాదాద్రి ఆలయానికి సంబంధించిన ఓ దినపత్రిక న్యూస్ ” దేవుడు శాసించాడు…KCR నిర్మించాడు” అనే క్యాప్షన్ తో తన అకౌంట్ లో ట్వీట్ చేయడం జరిగింది. అనంతరం జరిగిన పరిణామాలతో ఢిల్లీ లిక్కర్స్ కేసులో అరెస్టయి జైలు జీవితం గడిపింది. ఆనాటి నుంచి ఇనాక్టివ్ గా ఉన్న కల్వకుంట్ల కవిత ట్విట్టర్ అకౌంట్ తిరిగి గురువారం సత్యమేవ జయతే అనే క్యాప్షన్ తో మరల ట్వీట్ ప్రారంభించింది.MLC కవిత ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కవిత అభిమానుల నుండి జెట్ స్పీడ్ రిప్లై రావడం జరుగుతుంది. తమ అభిమాన నాయకురాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో అక్టీవ్ కావడం తో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తనను జగమొండిగా మార్చారని… ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఘాట్ కామెంట్స్ చేసిన విషయం విధితమే.