నేటి గదర్ న్యూస్ , ఆగస్ట్ 29 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
బ్యాంకులో రుణం తీసుకుని , రేషన్ కార్డు లేక ఇతరేతర కారణం చేత రుణమాఫీ కానీ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు పంపింది.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో రుణ మాఫీ కానీ రైతుల కోసం బుదవారం నుండి అన్ని గ్రామాల్లో వ్యవసాయ అధికారులు రుణమాఫీ కానీ రైతుల వివరాలను సేకరిస్తున్నారు.. కూసుమంచి మండలం జక్కేపల్లి ,జుజ్జులరావు పేట గ్రామాల్లో బుదవారం వ్యవసాయ అధికారులు ఏడిఏ సరిత , ఏవో వాణీ లు వేర్వేరుగా గ్రామ సభలో పాల్గొని ,పంచాయితీలో రుణమాఫీ కానీ రైతుల కుటుంబ సభ్యుల వివరాలు ,వారికి సంబంధించిన గ్రామ పంచాయితీలో దృవీకరణ పత్రం ,ఆధారు కార్డు జిరాక్స్ ,లోన్ వివరాలు పరిశీలించడం జరిగింది. రైతు రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు.. రుణమాఫీ పై ఎటువంటి అనుమానాలు ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు రవితేజ, వంశీకృష్ణ పాల్గొన్నారు.