రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 31:- మెదక్ జిల్లా రామాయంపేట,పట్టణంలో శనివారం రోజు చిత్తరమ్మ దేవాలయంలో రామాయంపేట సగర సంఘం
ఆదేశానుసారం సెప్టెంబర్ 4న తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యకులు ఉప్పరి శేఖర్ సగర నేతృత్వలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టనున్న సగర రాజకీయ చైతన్య,సదస్సును విజయవంతం చేయాలని సగర సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు సందిల సాయిలు,జిల్లా ప్రధాన కార్యదర్శి,మార్కు,నగేష్ కోరారు.ఈ మేరకు స్థానిక చిత్తరమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ప్రసంగిస్తూ సగరులు రాజకీయంగా ఎదగాలనే లక్ష్యంగా చేపట్టనున్న ఈ సదస్సుకు జిల్లాలోని సగరులు వార్డు మెంబర్ స్థాయి నుండి సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ,ఇతర పదవులు చేపట్టిన,గతంలో పదవులు చేపట్టిన మాజీ ప్రజాప్రతి నిధులు సదస్సులో పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సగర సంఘం,జిల్లా ప్రధాన కార్యదర్శి,మర్కు నగేష్ సగర,జిల్లా కోశాధికారి ద్యాప బాలకిషన్ సగర,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మర్కు దత్తు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కల్లెట్ల రవీందర్ సగర,రాష్ట్ర యువజన సంఘం సంయుక్త కార్యదర్శి,వగ్గు శ్రీకాంత్ సగర,రాష్ట్ర యువజన సంఘం కార్యవర్గ సభ్యులు రామారపు పోచయ్య సగర జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి వగ్గు శ్రీకాంత్ సగర చింటు,జిల్లా యువజన సంఘం,కోశాధికారి,ఉప్పరి సాయిలు రామాయంపేట సంఘం రెండు బెడల అధ్యక్షులు,మర్కు భూమయ్య సగర, దేశాయిపేట నాగభూషణం సగర,సంఘం సభ్యులు దోమకొండ చిన్న సిద్దరాములు సగర, మర్కు బాలరాజు సగర, రామారపు యాదగిరి సగర, పొడిశెట్టి సిద్దరాములు సగర, అంబాజీపేట సంఘం సభ్యులు ద్యాప నర్సింలు సగర, ధ్యాప సాయిబాబా సగర, ద్యాప యాదగిరి సగర తదితరులు పాల్గొన్నారు.