రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఆగస్టు 31:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో స్థానిక శ్రీ రాజరాజేశ్వర సీతా రామాంజనేయ నవగ్రహ సంతోషిమాత దేవాలయంలో మెదక్ నియోజకవర్గ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు క్యాబినెట్ మంత్రి పదవి దక్కాలని,కాంగ్రెస్ పార్టీ ఝాన్సీలింగాపూర్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఈమేరకు టేకుమట్ల సత్యనారాయణ,కాంగ్రెస్,పార్టీ,అధ్యక్షులు,టంటం.మస్తాన్ బాబు యూత్ కాంగ్రెస్, అధ్యక్షులు,సుంకరి.రవికుమార్,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు,ఎర్ర నరేష్,పల్లె భరత్,పూజలో పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ పదవి వచ్చిన వెంటనే గతంలో మొక్కుకున్న విధంగా ఎమ్మెల్యే రోహిత్ రావు కు క్యాబినెట్ మంత్రి పదవి వచ్చిన వెంటనే ఝాన్సీ లింగాపూర్ గ్రామం నుండి తిరుపతి దేవస్థానానికి వెళ్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో టేకుమట్ల సత్యనారాయణ,ఝాన్సీ లింగాపూర్ గ్రామ అధ్యక్షులు,టంటం.మస్తాన్ బాబు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,సుంకరి రవికుమార్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.