కూసుమంచి తహసిల్దార్ సురేష్ కుమార్..
నేటి గదర్ న్యూస్ , సెప్టెంబర్ 7 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు)
నేటి నుండి మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నాయి అని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు … ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాల తాసిల్దార్ల తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు తగు సూచనలు చేశారు… కూసుమంచి మండల ప్రజలను తహసిల్దార్ సురేష్ కుమార్ మండల ప్రజానీకానికి అప్రమత్తం చేస్తూ .. నేడు నుంచి మూడు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో మండల ప్రజలు బయటకు వెళ్లవద్దని అన్నారు.. అలాగే చేపల కోసం షికారు చేసే వారు కూడా ఈ మూడు రోజులు చెరువుల వద్దకు కుంటల వద్దకు వెళ్లకపోవటమే మంచిదని హెచ్చరించారు. నేటి నుంచి వర్ష ప్రభావం వల్ల ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు.