రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 7:- తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నియమకం అయ్యారు.ఆయన 2021 జూన్ 26న పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేశారు.2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా కొనసాగారు. 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు.ఆయన నూతనంగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా నియామకం అయిన సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాదులోని హైదర్ గూడలో మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో శనివారం రోజు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి ఆయనను సన్మానించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర గీత సెల్ చైర్మన్ నాగరాజు గౌడ్, భరత్ గౌడ్,శ్రీకాంత్ గౌడ్, తాళ్ల పండరి గౌడ్,సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
