నేటి గదర్ , సెప్టెంబర్ 18( పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాలేరు జలయశం ఎడమ కాల్వకు గండి పడడంతో గండిని పూడ్చే పనులు గత రోజులుగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.. మంత్రి పొంగులేటి ఆదేశాలతో బుదవారం కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు కాల్వ మరమ్మత్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు… కాల్వ మరమ్మత్తులు పూర్తి అయితే వెంటనే రైతులకు ఖరీఫ్ పంటకు నీళ్లు ఇస్తామని ఇటీవల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ ఎంపీపీ జుకూరి గోపాల్ రావు, మాజీ ఎంపీటీసీ మదాసు ఉపేందర్ ,ఇరిగేషన్ ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, డిఇలు రత్నకుమారి ,రమేష్ రెడ్డి , ఏఈ కోటేశ్వరరావు ,అర్వపల్లి జనార్దన్ ఉన్నారు..
Post Views: 12