★ఆదివాసి గిరిజనులకు అందని ద్రాక్షగా కంప్యూటర్ విద్య?
★తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భద్రాద్రి జిల్లా ఆదివాసి ఎమ్మెల్యేలు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తెలియజేస్తున్నాను
★GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఐటిడిఎ భద్రాచలం పరిధిలో సుమారు 40 ఆశ్రమ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేసినారు. వీటి ద్వారా డిజిటల్ తరగతులు కూడా బోధించడానికి వీలుగా ఉంటుందని అందులో డిజిటల్ క్లాస్ రూమ్ లు కూడా ఏర్పాటు చేసినారు. కానీ అందులో బోధించడానికి ICT instructor’s లు లేరు. 2018 నుంచి కొన్ని పాఠశాలలో కంప్యూటర్ టీచర్స్ ను థర్డ్ పార్టీ ద్వారా నియమితులైన వీరు 2023 మార్చి వరకు విధులు నిర్వర్తించారు. 2023 విద్యా సంవత్సరం నుండి వీరిని ఆపేశారు ఏమని థర్డ్ పార్టీనీ ప్రశ్నించగా వారు వేరేవారికి కాంట్రాక్టు వచ్చిందని చెప్పారు. తరువాత మరొక కాంట్రాక్టు వారు 10-10-2023 న నోటిఫికేషన్ విడుదల చేసి సుమారు భద్రాద్రి జిల్లాలో 40మంది కంప్యూటర్ టీచర్స్ ను డెమో మరియు ఎగ్జామ్ ద్వారా నియమించుకుని వారిని ఇంకా విధుల్లోకి తీసుకోకుండా కాలయాపనం చేస్తూ వస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసి ఏడాది గడుస్తున్న ఇంకా విధుల్లోకి తీసుకోకపోవడం గమనార్హం. కొన్ని లక్షలు ఖర్చు చేసి లాబ్స్ ను ఏర్పాటుచేసి ఇప్పుడు అవి నిరుపయోగంగా పడున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజన విద్యార్థులకు కంప్యూటర్ భోధన విద్య అందించాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు