హైదరాబాద్ జిల్లా:
జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్. హెచ్.ఎం)లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. సంఘం నాయకులతో కలిసి బుధవారం కోఠి లోని డీఎంహెచ్ఎస్ క్యాంపస్ ఆవరణలోని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ (సీ.ఎఫ్.డబ్ల్యూ.) కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 228