రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్ లో ఉన్న బీసీ హాస్టల్ భవనంలోకి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను మార్చడానికి పూర్తిస్థాయిలో మరమ్మతు పనులకు ఎస్ ఎం సెహగల్ ఫౌండేషన్ ద్వారా మరమ్మతులు పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు గురువారం రోజు ప్రారంభోత్సవం చేశారు.అయన వెంట జిల్లా విద్యాధికారి రాధా కిషన్,మండల విద్యాధికారి నీలకంఠం,రామాయంపేట సీఏంఓ సుదర్శన్ మూర్తి పనులను పరిశీలించడం జరిగింది.జనవరి 2025 నాటికి పాఠశాలను బిసి హాస్టల్ భవనంలోకి మార్చడానికి ఏర్పాటు చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.రమేష్, హాస్టల్ వార్డెన్ స్వామి మరియు ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.