రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆదేశాల మేరకు గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం రోజు పట్టణంలోని సెంట్రల్ బట్టర్ ఫ్లై లైటింగ్ క్రేన్ సహాయంతో మున్సిపల్ సిబ్బంది సరిచేశారు.రోడ్డు మీద వచ్చేపోయే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్ మరమ్మతులు చేపట్టారు.ఈ రోజు సాయంత్రం వరకు పూర్తిగా విద్యుత్ లైట్లు వెలిగించాలని సిబ్బందికి సూచించారు.అదే మాదిరిగా చెరువుల వద్ద మున్సిపల్ అధికారులను సిబ్బందిని 24 గంటలు అక్కడనే బస చేస్తూ పూర్తి విగ్రహాలు నిమజ్జనం చేసే వరకు ఉండాలని ఆదేశించారు.నిమజ్జనం సందర్భంగా పట్టణంలో భోజన వసతి టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.ప్రభుత్వ కేటాయించిన గజ ఈతగాళ్లను మరియు మున్సిపల్ శానిటేషన్ సిబ్బందిని కూడా సర్వయి కుంట, కొత్తచెరువుల వద్ద ఉండేందుకు విద్యుత్ సిబ్బందికి,పోలీసు సిబ్బందికి విజ్ఞప్తి చేశారు.పట్టణంలో వచ్చిపోయే గణేష్ విగ్రహాలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ రూల్స్ సరైన మార్గంలో ఏర్పాటు చేయగలరని కూడా పోలీస్ శాఖ,విద్యుత్ శాఖకు సంబంధించిన సిబ్బంది పట్టణంలో అన్ని వీధులలో కరెంటు వైర్లు తగలకుండా నిఘా ఉంచాలని తెలిపారు.