ముఖ్యఅతిథిగా హాజరైన వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజ్.
నేటి గదర్ న్యూస్ సెప్టెంబర్ 19:వైరా ప్రతినిధి.
వైరా:-స్థానిక మున్సిపాలిటీ పరిధిలో గల వ్యవసాయ మార్కెట్ ఎదురుగా హ్యూమన్ రైట్స్ సొసైటీ కార్యాలయం నందు గురువారం మానవ హక్కులు – చట్టాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా స్థానిక ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజు హాజరై మాట్లాడుతూ ప్రస్తుత చట్టాలలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని వాటికి అనుగుణంగా ప్రతి ఒక్కరు చట్టాలకు లోబడి ప్రతి ఒక్కరూ పనిచేయాలని, గ్రామాల్లో ఉన్న ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని హ్యూమన్ రైట్స్ సొసైటీ సభ్యులకు సూచించారు.వివిధ మండలాల నుండి వచ్చిన నూతన సభ్యులకు వారి చేతుల మీదుగా ఐడి కార్డ్స్ అందజేశారు.అనంతరం హ్యూమన్ రైట్స్ సొసైటీ సభ్యులు ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజుని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ, బహుజన అభ్యుదయ సేవా సమితి వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం,హ్యూమన్ రైట్స్ సొసైటీ రాష్ట్ర కో ఆర్డినేటర్, బహుజన అభ్యుదయ సేవా సమితి అధ్యక్షురాలు ఆదూరి మణి,రాష్ట్ర కన్వీనర్, లీగల్ అడ్వైజర్ ఇనపనూరి మహేంద్ర నాథ్,హ్యూమన్ రైట్స్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు మోదుగు వినోద్ కుమార్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఐలూరి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర కోశాధికారి కువ్వారపు విజయరావు,జిల్లా అధ్యక్షురాలు కరిశ రమణ, ఖమ్మం టౌన్ అధ్యక్షురాలు బొల్లెపోగు ప్రేమ కుమారి,ఖమ్మం రూరల్ అధ్యక్షులు మాగం వెంకటేశ్వర్లు,వైరా మండల అధ్యక్షురాలు బుడిగ సునీత,ఉపాధ్యక్షులు ఇనపనూరి నాగార్జున్, కోశాధికారి ఇనపనూరి వెంకటేశ్వర్లు,కొణిజర్ల మండల అధ్యక్షులు కొమ్ము భద్రయ్య, కొణిజర్ల మండల సెక్రెటరీ గొల్లమందల నాగేశ్వరరావు, బోనకల్ మండల అధ్యక్షులు తాళ్లూరు కిరణ్,ఎర్రుపాలెం మండల అధ్యక్షులు నండ్రు కోటేశ్వరరావు,హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ తల్లాడ మండల అధ్యక్షురాలు గంజాయి కుమారి తదితరులు పాల్గొన్నారు.