నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, తుమ్మలపల్లి గ్రామం లో ఈ రోజు డి ఏ ఓ పుల్లయ్య, ఏ డిఏ వైరా కరుణ శ్రీ, మరియు ఏ ఓ బాలాజీ, వరి మరియు ప్రత్తి పంటలను పరిశీలించటం జరిగింది, ఎండలు ఎక్కువగా ఉండటం వలన రసం పిల్చే పురుగులు ఎక్కవ అవుతున్నాయి , మరియు మొన్న కురిసిన వర్షానికి కొంత మంది రైతులు యూరియా ఎక్కువ వేసి న ప్రత్తి పంటలో రసం పిల్చే పురుగులు ఎక్కువ వచ్చే అవకాశం వుంది, మరియు ప్రత్తి లో మాగ్నిసియం లోపం కూడా కనిపిస్తుంది, వరి లో సింగల్ గా యూరియా చల్లగూడదు, ఇప్పుడు వున్న పరిస్థితి లో అగ్గి తెగులు, దోమ వచ్చే అవకాశం వుంది, రైతులు యూరియా వేడుకొనే టప్పుడు దానితో పాటు 10 kg పోటాష్ కలుపుకొని వేసుకోవాలి, ప్రత్తి లో రసం పిల్చే పురుగులు వున్నపుడు వేప సంబంధిత మందులు ఎకరాకు 500 ml, నీమ్ఆయిల్ పిచకారి చేసుకోవాలి, తరువాత తనికెళ్ళ రైతు వేదిక నందు డిజిటల్ క్రాప్ సెర్వే గురించి స్టేట్ లెవల్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గున్నారు, వచ్చే వారం నుండి ప్రతి ఏ ఈ ఓ తనకు వున్న క్లస్టర్ లో ప్రతీ రైతు వివరాలు డిజిటల్ సెర్వే చెయ్యాలి అని ప్రతీ సర్వే నెంబర్ ఫోటో తీసి సైట్ లో అప్లోడ్ చెయ్యాలి అని కమీషనర్ ఈ రోజు ట్రేనింగ్ లో చెప్పినారు, ఈ కార్యక్రమం లో డి ఏ ఓ , ఏ డి ఏ కరుణశ్రీ,, ఏ ఓ బాలాజీ, మండలం లో అందరు ఏ ఈ ఓ స్ పాల్గున్నారు.