★ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
★ బస్తీ దవాఖాన సపోర్టింగ్ స్టాప్ కు జీవో నెంబర్ 60 ప్రకారం 15600 రూపాయల కు జీతం పెంచడం ను ఏఐటీయూసీ హర్షిస్తుంది
నేటి గదర్ ,హైదరాబాద్:
బస్తీ దావఖనల్లో గత అనేక సంవత్సరాలుగా దాదాపు 200 మంది సపోర్టింగ్ స్టాఫ్ తన విధుల్ని నిర్వహిస్తున్నారని వారికి అనేక సంవత్సరాలుగా అతి తక్కువ జీతాలు రూపాయలు 9500 మాత్రమే చెల్లిస్తున్నారని వారికి ఔట్సోర్సింగ్ జీవో ప్రకారం 15,600 చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక విజ్ఞప్తిలో పోరాటాలు చేసిన ఫలితంగా వారికి జీవో నెంబర్ 60 కిందికి తీసుకురావడం సంతోషకరమని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ హెచ్ ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ , ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ బస్తీ దావఖనలు నడవడంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారని కింది స్థాయిలో అన్ని రకాల పనులను వీరు నిర్వహిస్తున్నారని వీరిని జీవో నెంబర్ 60 కిలోకి తీసుకురావడంతో మరింత మెరుగైన సేవలు చేయడానికి అవకాశం ఉంటుందని వారు వివరించారు.
గత ప్రభుత్వం పి ఆర్ సి విడుదల చేసిన సందర్భంలో జీవో నెంబర్ 60 ని తీసుకురావడం జరిగిందని ఈ జీవోలో కూడా అనేక అవకతవకలు జరిగాయని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఔట్సోర్సింగ్ గైడ్లైన్స్ ఉన్నప్పటికీ వాటిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా రాబోయే రోజుల్లో పిఆర్సి విడుదల అయిన సందర్భంలో వీరికి రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ వేతనం అమలు చేసి న్యాయం చేయాలని అప్పటివరకు ఏఐటియుసి పోరాటం నిర్వహిస్తుందని వారు తెలియజేశారు.కార్మిక వర్గం ఐక్యంగా ఉండి పోరాటం చేయడం ద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోను ఇన్ని సంవత్సరాలకు ఈ కార్మికులకు అమలు చేయడం సంతోషకరమని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ , వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వి. కర్ణన్ కృతజ్ఞతలు తెలియజేశారు..