రాష్ట్రంలో రైతులు ప్రజాభవన్ ముట్టడికి వేలుతున్న రైతులను అరెస్టు చెయ్యడం ఎంటి:మాజీ ఎమ్మెల్యే రేగా
నేటి గద్దర్ కరకగూడెం:తెలంగాణ రాష్ట్రంలోని రైతులు వారి సమస్యలు తెలపడానికి ప్రజాభవన్ కి వేలుతుంటె వారి ఇండ్లలోకి వెళ్ళి అదుపులోకి తిసుకోని అరెస్టు చెయ్యడం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నిదర్శనం అని బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాపీ చేస్తామని హామీ ఇచ్చిన కనీసం 40 శాతం రైతులకు కూడా రుణమాపీ చెయ్యలేదు అన్నారు. రైతులు వారి సమస్యలు శాంతియుతంగా తెలపడానికి ప్రజాభవన్ కు వెళుతున్న సందర్భంగా దేశానికీ అన్నం పెట్టె రైతులను నిర్బంధించడం వారి పతనం కావడం తప్పదు అన్నారు.
Post Views: 29