★మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయం లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సుమతి సింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ రోజు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయా శాఖల అధికారులతో ప్రజల సమక్షంలోనే మాట్లాడి సమితి సింగారం పంచాయతీ పరిధిలో గల గ్రామలలో నీటి సరఫరా గురుంచి, కరెంటు సమస్యల గురుంచి, ఇరిగేషన్ ఇలా అన్ని సమస్యలను అధికారుల దృష్టిలోకి తెచ్చి వారం లోగ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలనీ అదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా అధికారులతో పనులు చేపిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం అర్హులైన ప్రతీ ఒక్కరికి అందేలా చూసుకునే బాధ్యత నాది అని ప్రజలకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని ఎవరికైనా అందని యెడల నేరుగా వచ్చి నాకు తెలియజేయాలని అనంతరం గ్రామస్తుల సమస్యల విని వారు ఇచ్చిన దరఖాస్తులను తీసుకొని సమస్యలకు తగిన అధికారులకు దరఖాస్తులు ఇచ్చి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు*
ఈ కార్యక్రమం లో అన్ని శాఖల అధికారులు, గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.