అసిఫాబాద్ జిల్లా జైనూరులో గిరిజనులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని బిజెపి ఎస్టీ మోర్చా ఆరోపించింది. 1/70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముస్లింలు అక్కడ స్థిరపడి, గిరిజనుల భూములు ఆక్రమిస్తున్నారని బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారి నేతృత్వంలోని బృందం తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్, పీసా చట్టం, 1/70 యాక్ట్‌ను అమలు చేయాలని వారు కోరారు. గవర్నర్ గారు సానుకూలంగా స్పందించి, జైనూరు సందర్శించి గిరిజనులకు న్యాయం చేస్తానని, పీసా చట్టాన్ని అమలు అయ్యేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Post Views: 12