★అదిలాబాద్ లో మీడియా సమావేశం
నేటి గదర్ న్యూస్:
ఎస్సీ. ఎస్టీ వర్గీకరణ, క్రిమిలియర్ కు వ్యతిరేకంగా సెప్టెంబర్ 30 న ఛలో సచివాలయం ముట్టడికి తరలి రావాలని ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్, దళిత బహుజన పార్టీ DBP జాతీయ అధ్యక్షులు సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునీచ్చారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశం లో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు *గవ్వల శ్రీకాంత్* తో కలిసి ప్రెస్ మీట్ లో *కృష్ణ స్వరూప్* పాల్గొన్నారు
ఈ సందర్బంగా ఛలో హైదరాబాద్ సచివాలయం ముట్టడి కార్యక్రమం కరపట్రాలను ప్రెస్ క్లబ్ లో విడుదల చేశారు
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పటేల్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి దళిత సమాజంలో చిచ్చు పెట్టారని విమర్శలు చేసారు. దళిత జాతుల ఓట్ల తో గద్దె నెక్కిన రేవంత్ రెడ్డి దళితుల గిరిజన బహుజనులను విచ్చిన్నం చేసి వీరి భౌశ్యత్ ను దెబ్బతిసారని.. సామాజిక బానిసత్వం నకు కుట్రలు లేపారని అన్నారు రాజ్యాధికారంను సాధించకుండా చేయడానికి వర్గీకరణ పేరుతో దళితుల అభివృద్ధి ని అడ్డుకున్నారని తెలిపారు. వర్గీకరణ పైన సుప్రీం కోర్ట్ ఇచ్చిన రాజ్యాంగం వ్యతిరేక తీర్పు ను
ఉపసంహారించికోవాలని కోరుతూ వందకు పైగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ లు పెండింగ్ లో ఉండగా.. తొందరపడి వర్గీకరణ కమిటీ ని సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసి దళితుల ద్రోహి గా మిగిలాడని అన్నారు దళితుల గిరిజనుల బహుజనుల ఉమ్మడి రాజ్యాంగం హక్కులను దెబ్బతీయడానికి పూను కున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీని తెలంగాణ లో బొంద పెట్టాలని దళిత గిరిజన బహుజనుల సమాజానికి పిలుపునిచ్చారు. ఈ నెల 30 న చలో సచివాలయం హైదారాబాద్ జరిగే ఆందోళన. నిరసన కార్యక్రమం లో వేలాదిగా పాల్గొని ఎస్సీ. ఎస్టీ జాతుల సత్తా ఈ మనువాద దోపిడీ మాఫియా పాలకులకు మన సత్తా తెలియజేయవలిసిన సమయం ఆసన్న మైనదన్నారు. వర్గీకరణ వద్దు.. రాజ్యాధికారం కావాలంటూ.. పోరాటాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమం లో ఎస్సి ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్.
ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సూర్య వంశీ విద్యా సాగర్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ విద్యార్థి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సెడ్మకి భీమ్ రావు.జిల్లా కార్యదర్శి మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ల రమేష్. దళిత బహుజన పార్టీ DBP జిల్లా అధ్యక్షులు భీమరావు నేతకాని సంఘం జిల్లా అధ్యక్షులు జునుగూరు లక్ష్మణ్ సిపిఐ ఎంల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి.జగన్ సింగ్. జాదవ్ శ్యాం సుందర్. ఆజాద్ సమాజ్ పార్టీ ASP జిల్లా అధ్యక్షులు షేక్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.