రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 19:- హైదరాబాద్ కు చెందిన ఎలిగేపల్లి భారతమ్మ (75) హైదరాబాదులో కూలి పని చేసుకుంటూ జీవనం కోనసాగిస్తుండేది.గత కొన్ని నెలల క్రితం కాలు జారీ కిందపడి నడుము విరిగిపోవడంతో తన కూతుర్లు ఆసుపత్రిలో వైద్యం చేయించారు.అక్కడ ఎవరూ లేకపోవడంతో రామాయంపేటలో ఉన్న పెద్ద కూతురు కళావతి వద్దకు తీసుకువచ్చి ఇక్కడ వైద్యం చేయిస్తోంది.కొడుకు రాజు వరంగల్ లో భార్యా పిల్లలతో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కోనసాగిస్తున్నాడు.గత నెల రోజుల నుంచి కూతురు వద్ద ఉన్న తల్లిని కనీసం చూడడానికి కూడా రాలేదు.కూతురే తల్లికి సేవ చేసుకుంటూ ఉన్నారు.అనారోగ్యంతో ఉన్న తల్లి భారతమ్మ ఒక్కసారిగా 18న రాత్రి మరణించింది.కొడుకు రాజుకు సమాచారం ఇచ్చారు.కనీసం అంత్యక్రియలకు కూడా రాలేదు.తల్లికి తలకొరివి కూడా పెట్టలేదు.రామాయంపేటకు వచ్చి రోడ్డు పై నుండి చూసి మాతృమూర్తి అనే మానవత్వం లేకుండా వెళ్ళిపోయాడు.కుమారుడు ఉండి కూడా తల్లికి తలకొరివి పెట్టలేదని పట్టణ ప్రజలు బాధపడుతూ ఆశ్చర్యానికి గురయ్యారు.పెద్ద కూతురు కళావతి తల్లికి తలకొరివి పెట్టింది.కూతురిని చూసి పట్టణవాసులంతా కన్నీరు మున్నీరయ్యారు.