రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 24:- మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి 44 పై రోడ్డు ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.మహారాష్ట్ర నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో కారు పల్టీ అయ్యి రోడ్డు పక్కకు దూసుకుపోయింది.ఈ ప్రమాదంలో బొలెరో వాహనం క్యాబిన్ ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.బొలెరో వాహనం డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు,ఫైర్ సిబ్బంది,108 సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని డ్రైవర్ ను రెండు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు.అనంతరం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి డ్రైవర్ క్లినర్ ను చికిత్స నిమిత్తం తరలించారు.తీవ్ర గాయాల పాలైన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.ఈ మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.