రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 24:- మెదక్ ప్రాజెక్ట్ పరిధిలోని పాపన్నపేట మండలం నార్సింగి సెక్టార్ లోని మొదటి సెంటర్ ఆర్కెల అంగన్వాడీ కేంద్రంలో పోషణమాసం కార్యక్రమం ఘనంగా మంగళవారం నాడు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ జె.మంజుల హాజరయ్యారు.ఆమె మాట్లాడుతూ సెక్టర్ పరిధిలో పోషణ మాసంలో భాగంగా గర్భిణి స్త్రీలకు అంగన్వాడిలో సామూహిక శ్రీమంతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా వారికి తగిన పౌష్టికాహారము పాలు గుడ్లు అనుదినం అందజేస్తూ వారి ఆరోగ్య రీత్యా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.అలాగే అంగన్వాడీలో చిన్న పిల్లలకు బాలామృతం ప్రతిరోజు అందిస్తూ వారి ఎదుగుదలకు పాటుపడుతున్నట్లు,అంగన్వాడీ సెంటర్ లలో అన్నప్రసాద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమాలు ఈనెల 30 వరకు అన్ని అంగన్వాడి సెంటర్లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సెంటర్ లో అంగన్వాడి పిల్లలతో పాటు ఆమె భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలియపరచారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు హైమద్ఉన్నిసా,సంధ్యారాణి పంచాయతీ సెక్రటరీ,ఆయా సరోజన,గర్భిణీ స్త్రీలు,బాలింత స్త్రీలు, పిల్లలు పాల్గొన్నారు.