+91 95819 05907

కుల నిర్మూలనకై సెప్టెంబర్ 24 నుండి 30 వరకు ఆచరణాత్మక కార్యక్రమం కొనసాగిద్దాం:సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు

భారత ప్రజాస్వామిక విప్లవ ప్రత్యేక సమస్యలలో కుల సమస్య ఒకటి. దీనికి మూలాలు వర్ణవ్యవస్థలోనూ, బ్రాహ్మణవాదంలోనూ ఉన్నాయి. భారతదేశ సామాజిక పరిణామ ప్రత్యేక స్వభావంతో ముడిపడి ఉన్న కుల వ్యవస్థ ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు దోపిడీ వర్గాలు శ్రామిక ప్రజానీకాన్ని దోచుకునే అత్యంత ముఖ్యమైన సాధనంగా ఉంది. మెజారిటీ పీడిత ప్రజానీకాన్ని దోపిడీ చేయడాన్ని, అణచివేయడాన్ని సుసాధ్యం చేసే భావజాలంగానూ, సామాజిక వ్యవస్థ గానూ కుల వ్యవస్థ భారత పాలకవర్గాలకు ఉపయోగపడుతున్నది. కుల వ్యవస్థ నిర్మూలన కోసం సరైన కార్యక్రమం రూపొందించుకోవాలి. దీన్ని రూపొందించుకోవాలంటే కుల వ్యవస్థ ఎలా పుట్టిందో……. ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలి.

మన దేశంలో కుల వ్యవస్థ మూలాలకు మూడు వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నది. వర్గ సమాజం అభివృద్ధి చెందడంలోనూ, రాజ్యం ఆవిర్భావంతోనూ, ఫ్యూడల్ ఉత్పత్తి విధానం అభివృద్ధి తోనూ దోపిడీ, వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థలోకి సొంత ఆచారాలు, అలవాట్లు కలిగిన తెగల సముదాయాల నిరంతరాయ తరచుగా బలవంతపు విలీన కార్యక్రమంతోనూ కుల వ్యవస్థ విడదీయరాని విధంగా ముడిపడింది.

క్రీస్తుపూర్వం 1500- 500 మధ్యకాలంలో వాయువ్య దిశ నుండి దేశానికి వలస వచ్చిన పశుపాలకులైన ఆర్య తెగలు, స్థానిక వ్యవసాయ తెగల తోనూ వ్యవసాయేతర తెగలతోనూ ఘర్షిస్తున్నప్పుడు వర్ణాలు (బ్రాహ్మణ క్షత్రియ వైశ్య) వర్గాలుగా ఉనికిలోకి వచ్చాయి. క్షత్రియులు, బ్రాహ్మణులు పాలక కూటమిగా వైశ్యులు దోపిడీకి గురైన రైతాంగంగా ఉండేవారు. ఈ క్రమంలో వ్యవసాయం ప్రధానమైన ఉత్పత్తి విధానంగా ఆచరించడంతో అతిహీన వర్ణంగా శూద్ర వర్ణం ఏర్పడింది. ఈ విధంగా క్రీస్తుపూర్వం 500 ప్రాంతంలో రాజ్యం ఆవిర్భవించింది.

తొలి ప్యూడల్ రాజ్యకాలం క్రీస్తుపూర్వం 500 నుండి, క్రీస్తుశకం నాలుగవ శతాబ్దం వరకు గల కాలం ఇనుప నాగలి విస్తృతంగా వాడుకులోకి వచ్చిన కాలం. స్థిర గ్రామ జీవితంతో ముడిపడిన వ్యవసాయం విస్తరించిన కాలం. ఈ కాలంలో వైశ్య రైతాంగము నుండి పాలకు కూటమిగా ఉన్న బ్రాహ్మణులు పన్నుల రూపేణా కానుకల రూపేణా మిగులును దోచుకునేవారు. విస్తారమైన రాజు భూముల (తీసా భూములు) లో శూద్రులు నిర్బంధ శ్రమ చేసేవారు. పెద్దపెద్ద వాణిజ్య రాజ్యాలు అభివృద్ధి చెందాయి. క్రీస్తుశకం నాలుగవ శతాబ్దం నుండి బ్రిటిష్ వారు వచ్చేవరకు గడిచిన కాలంలో రాజుకు ప్రజలకు మధ్య భూదానాలు (ల్యాండ్ గ్రాంటర్) పొంది పన్నులు వసూలు చేసే హక్కును కలిగిన చిన్న చిన్న పాలెగాళ్లు, దళారీలు ఏర్పడ్డారు. కుల వ్యవస్థ స్థిరపడింది. బౌద్ధం, జైనం క్షీణించాయి. బ్రాహ్మణ మతం ప్రాబల్యం పొందింది. చాలా విశాలమైన దేశంలోని ఒక్కొక్క ప్రత్యేక ప్రాంతంలోని తేడాలు ఉండే మాట నిజమే కానీ సాధారణ ధోరణులు మొత్తం భారతదేశానికి వర్తిస్తాయి.

క్రీస్తుపూర్వం 2000 నాటికే తేలికపాటి వ్యవసాయం చేసే కంచు యుగపు నాగరిక సమాజాలు భారతదేశంలో ఉన్నాయి. సింధూలోయ ప్రాంతంలోని ద్రావిడులు ఇనుము, నాగలి తెలియని కాలంలోనే నదులకు ఆనకట్టలు కట్టి నీటిని మళ్లించి పంటలు పండించారు. హరప్పా, మహేంజదారో వంటి పట్టణాలను ప్రపంచంలోనే నాగరికత తెలిసిన మొదటి కాలంలోనే నిర్మించారు. హిందూ వ్యాపారులు నైలు, మేత, పొటేమియా వంటి నాగరిక సమాజాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ కాలంలో భారత ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో కంచు యుగపు వ్యవసాయ సమాజాలు చిన్నచిన్న నాగరిక సమాజాలు ఉన్నాయి. కొన్ని తెగలు వ్యవసాయం, ఆహార సేకరణ, పశువుల పెంపకం చేసేవి. దక్షిణ ప్రాంతంలో నావిక వ్యాపారం కూడా ఉంది. అయితే కంచు యుగంలో ఇనుపయుగం కంటే ఉత్పత్తి తక్కువ. ఆ ఉత్పత్తి అంతా రాజన్య పురోహిత వర్తకవర్గం చేతిలో కేంద్రీకృతమైనది.

క్రీస్తుపూర్వం 1500 -500 సంవత్సరాలలో పశుపాలక సంచార జీవితం గడుపుతున్న ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించారు. వారికి అప్పటికే మెట్టనేయడం, వైద్యం చేయడం, ఆయుధాలు తయారు చేయడం తెలుసు. వారు ప్రాచీన సింధు నాగరికత కలిగిన నాగరిక జాతులైన కంచు యుగపు ద్రావిడులను తమకంటే వెనుకబడిన రాతియుగపు ఆటవికులను ఓడించారు. అప్పటికే ద్రావిడులలో ఉనికిలో ఉన్న మాతృ స్వామిక వ్యవస్థ స్థానంలో ఆర్యుల పితృ స్వామిక వ్యవస్థ ప్రారంభమైంది.

ఆర్యులు వాయువ్య దిక్కు నుండి ప్రవేశించి గంగానది పరివాహక ప్రాంతం దిశగా వ్యాపించారు. అప్పటికే వారు రాజన్య అనే ప్రభువును బ్రాహ్మణులు పురోహితులు గాను విష్ అనే సాధారణ గణ సభ్యులతోనూ విభజింపబడి ఉన్నారు. తూర్పు దిశగా సాగిన ఆర్యుల విస్తరణతో ముడిపడిన అంతులేని ఘర్షణలలోనూ, యుద్దాలలోనూ వివిధ పశుపాలక ఆర్యుల తెగల మధ్య ఆర్య తెగలకు స్థానిక తెగలకు మధ్య నీటి వనరుల కోసం, భూమి కోసం తర్వాత కాలంలో బానిసల కోసం జరిగిన ఘర్షణలలోనూ ఓడిపోయిన తెగలను బానిసలుగా గౌరవించడం ప్రారంభమైంది. అలా బానిసలుగా గౌరవించబడిన వారిని దాసులు, దస్యులు అని పిలిచేవారు.

ఆర్యులకు ఇతర తెగలతో యుద్ధాలు జరిగినప్పుడల్లా దాస్యులు ఆర్యుల పక్షాన పోరాడేవారు. అప్పటికే ఉత్తర భారత దేశంలో ఆహార ఉత్పత్తిని సాధించిన ఆర్యులది వ్యక్తిగత ఆస్తి. సమాజం కాక భూమిని, పశువులను సమిష్టి ఆస్తిగా కలిగిన జన సమాజం కావడం వలన వీళ్ళకు లోబడిన దాస తదితర ఆర్యేతరులు బానిసలు కాలేదు. వారు మొత్తం ఆర్య గణాలకు సమిష్టి సేవకులు అయ్యారు. వర్ణరీత్యా శూద్రులు అయ్యారు. దాసులను బానిసలు కాక శూద్రులుగా లోపరుచుకోవడం వలన భారత సమాజంలో రోమ్ తరహా బానిస వ్యవస్థ ఏర్పడలేదు. దాని స్థానంలో పూర్తిగా పరిణితి చెందిన బానిస సమాజం ఏర్పడింది.

గంగానది మైదాన ప్రాంతాలలో వరి సాగుతో సహా వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పాటుగా శ్రమ విభజన విస్తరించడం, వాణిజ్యం అభివృద్ధి చెందడం కూడా జరిగాయి. భూమి సొంత ఆస్తిగా మారింది. పట్టణాలు అభివృద్ధి చెందాయి. వైశ్య వర్తకులు గహపతుల (భూయజమానులు) వంటి నూతన వర్గాలు అస్తిత్వంలోకి వచ్చాయి. గహపతులు భూమిని దున్నేవారు కాదు. బానిసలతో లేదా శూద్రులతో దున్నించేవారు. అగ్ర (పీడక) వర్గాలకు, పీడిత వర్గాలకు మధ్య యజమానులకు శ్రామికులకు మధ్య ఉద్రిక్తలు తలెత్తాయి. ఇది రాజ్యం ఆవిర్భావానికి దారి తీసింది. గంగా మైదానాలలో బీహార్ లో కూడా తొలి రాజ్యాలు ఆవిర్భవించాయి.

ఇనుప నాగలి వినియోగించే విషయంలో, నక్షత్రాల విషయంలో బ్రాహ్మణులకు ఉన్న జ్ఞానం వలన వివిధ తెగలను ఆర్థీకరించడం ద్వారా లొంగదీసుకోవడంలో బ్రాహ్మణులు నిర్వహించిన పాత్ర వలన ఆనాటికి వికసిస్తుండిన వ్యవసాయక, ఆర్థిక వ్యవస్థలలో బ్రాహ్మణుల సామాజిక పునాది ప్రాధాన్యత విస్తరించాయి. వీరు వివిధ అసమాన అనుమానాస్పదమైన మూలాల నుండి ఆవిర్భవిస్తున్న పాలెగాళ్లకు రాజ దర్బారులో వంశ నామావళిని తయారు చేసి ఇచ్చేవారు. ఇది అనేకమంది రాజుల పాలనకు సంజత్వాన్ని కల్పించడానికి తోడ్పడింది. అందువల్ల ఈ నయా బ్రాహ్మనీయానికి పాలకుల మద్దతు ప్రత్యేకించి గుప్తుల కాలం (క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం)లోనూ ఆ తర్వాత లభించింది.

ఉత్తరాదిలోని కుషానులు, చాణుక్యులు దక్షిణాదిలోని వివిధ తెగల వర్ణ వ్యవస్థలో విలీనమైన తర్వాత వాణిజ్యం క్షీణించి స్వయం పోషక గ్రామ ఆర్థిక వ్యవస్థ అస్తిత్వంలోకి వచ్చిన క్రీస్తు శకం ఆరవ శతాబ్దము నాటికి ఈ నయా బ్రాహ్మనీయం మన సంస్కృతి పై ఆధారపడిన కుల వ్యవస్థ భారతదేశంలోని అత్యధిక భాగంలో ప్రాధాన్యాన్ని సాధించింది. సుమారు క్రీస్తు శకం ఆరవ శతాబ్దము నుండి కుల వ్యవస్థ భారతదేశం లోనే చాలా ప్రాంతాలలో సంఘటితం కావడం ప్రారంభమైంది. యూరప్ లో మూడో శతాబ్దం తర్వాత రోమన్ సామ్రాజ్యం పతనం కావడం ఎలా జరిగిందో, మనదేశంలో గుప్తుల కాలం తర్వాత వర్తక గిల్డులు, చేతివృత్తుల గిల్డులు క్షీణించడం ద్రవ్య చలామణి కుషించుకపోయి చేతివృత్తుల వారు గ్రామాలలో స్థిరపడడం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగాయి. ఈ పరిణామాలు కులాలపై ఆధారపడిన ఫ్యూడల్ విధానం తలెత్తడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించాయి. ఫ్యూడల్ విధానం తలెత్తడంతో పన్నుల రూపేణా లేదా ఉత్పత్తిలో వాటా రూపేణా రైతాంగం నుండి, శ్రామిక ప్రజల నుండి మిగులను దోచుకునే దళారి వర్గం ఆవిర్భవించడం కనపడుతుంది. మొదట్లో కేవలం భూదానాలు (బ్రాహ్మణులకు, బౌద్దరామాలకు, సైనిక అధికారులకు) ఇచ్చేవారు. తర్వాత కాలంలో వారికి పాలనాపరమైన విధులను కూడా కేటాయించారు. దళారీలకు పాలనాపరమైన విధులు ఇవ్వడం క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో శాతవాహనుల పాలన కాలంలో మొదట ప్రారంభం అయినా గుప్తుల కాలం క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో ప్రాచుర్యంలోకి రావడంతో వర్ణ వ్యవస్థలో ఉన్న యజమాని బానిస పరిస్థితులు నశించాయి. ఇళ్లలోని పనిచేయడానికి మాత్రమే దాసులను ఉపయోగించేవారు. యజమానులకు రకరకాల సేవలు చేయడం వీరి పని. ఒకవైపు అర్థ బానిస వ్యవస్థ, మరొకవైపు బానిస వ్యవస్థ మరొకవైపు వర్ణాలు, వర్గాలు, కులాలుగా మారే పరిణామం కొనసాగింది. ఒకే వృత్తి వారు ఒకే కులం గా మారడం ప్రారంభమైంది. వృత్తి, కులం పర్యాయపదాలు అయినవి.

వర్ణాలు కులాలుగా మారాయి. భారతీయ చాతుర్వర్ణ వ్యవస్థలో కర్షకుడు శూద్రుని స్థానం కలిగి ఉండగా మలినమైన పనులుగా పరిగణించబడే చచ్చిన పశువుల తోళ్ళను తొలగించి శుభ్రం చేయడం, పశువులను చంపడం వంటి పనులను కుటుంబంలోని దాసుల చేత చేయించేవారు. భారత ఫ్యూడల్ సమాజంలో చాతుర్వర్ణాలతోపాటు ఐదవ వర్ణం పంచములుగా అంటరాని వారితో అట్టడుగు వారి (అత్యంత పీడుతుల)తో ఏర్పడింది. వైశ్యులలో అత్యధిక భాగం శూద్రులుగా దిగజారిపోతున్న క్రమంతో దాసులు పెరుగుతున్న క్రమంలో మలినమైన పనులు చేయడానికి అంటరానివారనే ఐదో వర్ణం సృష్టించబడింది. వర్ణ వ్యవస్థ పునాదులను గట్టి పరచడంలో శూద్రులను అణిచిపెట్టడంలో కర్మ సిద్ధాంతం ప్రధాన పాత్ర వహించింది. వర్ణ ధర్మాన్ని భగవంతుడు నిర్దేశించాడని దాన్ని ఆచరించక పోవడం వల్ల దుష్పరిణామాలు సంభవిస్తాయని కర్మఫలీయం కాబట్టి నిస్సహాయంగా అనుభవించాల్సిందేననే భావజాలంతో నాలుగవ, ఐదవ వర్ణాలను అణచిపెట్టి ఉంచగలిగారు.

1873లో మహాత్మ జ్యోతిబాపూలే పూనాలో సత్యశోధ సమాజ్ ను ఏర్పాటు చేసి మహారాష్ట్రలోని బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమం ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకున్నది. తిస్వా పీడకులు పాలనను అంతం చేసి బ్రిటిష్ పాలకులు పెట్టుబడుదారి అభివృద్ధిని అలాగే అన్ని కులాలకు ప్రాశ్చాత్య ఆలోచనలు అందించారు. ఈ కాలంలో దేశంలోని అనేకమంది మేధావులు కూడా ప్రాశ్చాత్య పెట్టుబడిదారీ విధానం నుండి చాలా ఆశించారు. పూలే కూడా ఇదే పద్ధతిని ఆశించాడు. కుల నిర్మూలన కోసం సత్యశోధక్ సమాజ్ కార్యకలాపాలు కొనసాగాయి.

డాక్టర్ భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ ప్రతికూల పరిస్థితులలో విద్య నేర్చుకుంటూ ఉన్నత విద్యను అభ్యసించాడు. బాల్యం నుంచే కుల పీడన, సాంఘిక బహిష్కరణ అత్యాచారాలను ఎదుర్కొంటూ ఆయన పెరిగాడు. ఆనాటి సామాజిక పరిస్థితి స్వయంగా ఆ స్థితిని అనుభవించిన కారణంగా సహజంగానే కులం ఆయన అధ్యయన విషయంగా మారింది. ఆయన భారతదేశ కుల వ్యవస్థ పై ఒక గ్రంథాన్ని రచించారు. ఆయన అర్థశాస్త్రంలో కూడా లోతుగా అధ్యయనం చేసి ఒక గ్రంథాన్ని రాశారు. ఆయన కేవలం రాయడం వరకే పరిమితం కాలేదు, తాను అధ్యయనం చేయడం ద్వారా కులం పై రూపొందించిన విశ్లేషణను దాని నిర్మూలన కోసం చెప్పిన మార్గాన్ని సాకారం చేయడానికై దళిత ప్రజలను సంఘటితం చేశాడు. మహారాష్ట్రలో అంబేద్కర్ నాయకత్వాన దళిత ఉద్యమం ఆవిర్భవించింది. ఆయన దళితుల విముక్తిని ఆశించాడు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వారి ప్రయోజనాల కోసం జీవితాంతం కృషి చేశాడు. భారత చరిత్రలో ఆయన ఒక సాంఘిక సంస్కర్తగా, ఆర్దికవేత్తగా, రాజకీయవేత్తగా భారత రాజ్యాంగ నిర్మాతగా సుప్రసిద్ధుడే కాకుండా దళితుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచాడు. ఆయన తన జీవితకాలంలో హిందూ మతం పైన కులం పైన చేసిన పరిశోధనలు విశ్లేషణలు చాలా ముఖ్యమైనవి. ఈ విషయాలపై అనేక సిద్ధాంత గ్రంథాలు రాశాడు. అయితే ఆయన కులం పుట్టుకకు సంబంధించిన సరైన నిర్ధారణ చేయలేకపోయాడు. కుల నిర్మూలనకు పరిష్కారం సామాజిక దోపిడీ సంబంధాలను ధ్వంసం చేయడం ద్వారా కాకుండా హిందూ మతం నుండి బౌద్ధమతంలో ఒక మారడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించడమే పొరపాటు. అంబేద్కర్ కు ఉన్న బూర్జువా ఉదారవాద ఆలోచనా సరళి వలన రాజ్య స్వభావం గురించి ఆయనలో తప్పుడు అవగాహన ఏర్పడింది. అంబేద్కర్ ను ఒక విశాల ప్రజాస్వామ్య పోరాటంలో ఒక ప్రభావవంతమైన శక్తిగా తనను గుర్తించాలి. ఆయనను పాలకవర్గాల కోట నుండి వెలుపలకు తీసుకువచ్చి ఆయన ఎవరి కోసం అయితే తన జీవితాన్ని అర్పించారో వారి నిజమైన ప్రతీకగా నిలపాలి.

దేశంలో రోజురోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయి. తమిళనాడులోని కిల్వేన్మడిలో 1968లో దళిత వ్యవసాయ కూలీల పైన మూకుముడి మరణకాండ జరిగింది. 1970 శతాబ్దంలో చివరి భాగము నుండి దళితులపై మారణకాండలు పెరుగుతూ వచ్చాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ లోనే 1985లో కారంచేడులో, 1987లో నీరుకొండలో, 1991లో చుండూరులో, 1998లో పదురుకుప్పం వేంపేటలో, 1977లో లక్ష్యం పేట బీహార్లో, 1980లో హర్బిబాలో, 1980లో బఠానీ తోలాలో, 1997లో లక్షింపూర్ బతే , 2006లో బాల్బటార ,2006 రామ్ నగర్ హర్యానాలోని దిలీన జజర్, 2002 గోవాలో 2005 లో పేద దళిత ప్రజానీకంపై ఇలా ఎన్నో దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఇలా భూస్వామ్య పెత్తందారీ దురహంకార శక్తులు ప్రతి రాష్ట్రంలో దళితులపై అమానుషమైన హత్యకాండలు ఎన్నో జరుగుతున్నాయి. కులం శ్రమ విభజన తో పాటు శ్రామికుల విభజన కూడా చేస్తుంది. ఇది దోపిడీ పాలకవర్గాలకు తమ అధికారాన్ని చలాయించడానికి వారసత్వంగా లభించిన ఒక ఆయుధం. వర్తమాన ఆర్థిక సంక్షోభ పరిస్థితులలో పాలకవర్గాలు బ్రాహ్మణ హిందుత్వ పాసిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. దీని ద్వారా కొత్తగా కులమతపరమైన సాంప్రదాయక దాడులు పెరిగాయి. మోడీ నాయకత్వంలో బ్రాహ్మనీయవాద హిందూ మతోన్మాద పీడిత కుల దురహంకార సంఘ్ పరివార్ సంస్థలు వారి సాయిధ ముఠాలు మిళితమై రాజ్యం దన్నుతో దళితుల పైన మైనారిటీల పైన దాడులు దౌర్జన్యాలు తీవ్రతరం చేశారు. ప్రభుత్వ ముసుగులో ఈ శక్తులు దళితులను, ముస్లిం, క్రిస్టియన్, మతమైనారిటీలను, ఆదివాసీలను, విప్లవకారులను, ప్రజాస్వామిక లౌకిక వేతువాద శక్తులను, సంస్థలను అణచివేయడానికి కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తున్నారు. గోవులను దొంగతనంగా తరలిస్తున్నారనే నెపంతో ఈ ఫాసిస్టు శక్తులు హత్యలు చేస్తున్నారు. బ్రాహ్మణవాద , హిందూ మతోన్మాద పీడక కుల దురహంకార ఫాసిస్టు శక్తులు రాజ్య ఫాసిజం భయాందోళనలు సృష్టిస్తున్నాయి.

భారతదేశంలో కులాలు లోతుగా వేళ్ళూనుకొని ఉన్నాయి. దేశంలో కుల పీడన బ్రాహ్మణ ఆదిక్యత విస్తృతంగా వ్యాపించి ఉంది. దళితులు అమానుషమైన అంటరానితనం అనే ఆచారాన్ని ఎదుర్కొంటూ నిచ్చెనమెట్లలో కింద మెట్టుగా ఉన్నారు. అన్ని రూపాలలో కుల పీడనను వ్యతిరేకించాల్సి ఉన్నప్పటికీ దళితులపైన, పీడనపైన అంటరానితనం నిర్మూలన పైన ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. దళితులు లేదా షెడ్యూల్ కులాలను దుర్మార్గమైన కుల వ్యవస్థలో చిక్కిన భారత సమాజపు ప్రత్యేకమైన ఒక ప్రత్యేక సామాజిక సెక్షన్ గా పరిగణించాలి. వీరిలో అత్యధిక మెజారిటీ 90% పైగా పేద, భూమిలేని రైతాంగానికి, కార్మిక వర్గం తదితర వేతనాలకు పని చేసే సెక్షన్లకు చెందినవారై ఉంటారు. అయినప్పటికీ వీరు కూడా సామాజిక అణిచివేత పీడక కులాల దౌర్జన్యాలలో జీవితంలో అన్ని రంగాలలో విచక్షణకు గురవుతున్నారు. ఈ సామాజిక అణిచివేతకు సంబంధించిన అత్యంత హేయమైన అమానుషమైన వ్యక్తీకరణ దున్నేవానికే భూమి పంపిణీ చేసే ప్రాతిపదిక పైన వ్యవసాయక విప్లవాన్ని విజయవంతం పరిపూర్తి చేయడం ద్వారా నేటి అర్థ వలస అర్ధ భూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడంతోనే దళితుల సమస్యలకు నిజమైన పరిష్కారం ఉన్నది. అందుకై సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమాలను కొనసాగిద్దాం. వర్గ పోరాటాలతో పాటు కుల నిర్మూలనకై ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపడతాం.

ఆవునూరి మధు
సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఇద్దరు వ్యక్తులను గొడ్డెలతో నరికి హత్య చేసిన మావోయిస్టు లు

ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీ గ్రామంలో దారుణ హత్య పోలీసుల ఇన్ ఫార్మర్ నేపంతో ఇద్దరు వ్యక్తులు ఉయిక రమేష్, ఉయిక అర్జున్ లను రాత్రి 11 గంటల సమయంలో గొడ్డెలతో

Read More »

ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం….అమరుడు పురుషోత్తం సంస్మరణ సభ

*23-11-2024 (చిన్న తాండ్రపాడు )* ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష సాధన చుట్టూ మన కార్యచరణ ఉండాలి అలా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా జీవించిన వారిలో ఆచరించి చూపిన

Read More »

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

 Don't Miss this News !