◆వచ్చే స్థానిక సర్పంచ్,ఎంపిటీసి, జెడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు :చందా.మదు
నేటి గద్దర్ కరకగూడెం: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 100 సభలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలు,కాకమ్మ కథలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని వచ్చే స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని టిడిపి రాష్ట్ర నాయకులు చందా.మాధు అన్నారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మందు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు మోసపూరిత మైనవి అన్నారు.అయ్య సీఎం రేవంత్ రెడ్డి ఖరీఫ్ సీజన్ ప్రాభవం అయి 4 నెలలు కావస్తన్న నేటికి రైతు భరోసా ఇవ్వకపపోతివి కమిటీల పేరుతో కాలయాపన తప్ప మరొకటి ఎమి లేదు అని ఘాటుగా విమర్శించారు. అలాగే రెండు లక్షల రుణమాఫీ అంటివి నేటి వరకు అది పూర్తికాక రుణమాఫీ గాని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద కుటుంబంలో ఉన్న ప్రతి మహిళలకు 2500 రూపాయలు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,500 ఇచ్చిన హామీలు మర్చిపోయి నీ నోటికి వచ్చినట్టు సొల్లు మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న హామీలను అమలు చెయ్యాలని అయన డిమాడ్ చేశారు.