చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
విజయ్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు.విజయ కాలనీలో జరిగిన శాఖ మహాసభలో తొలుత పార్టీ జండా ఆవిష్కరణ సిపిఎం మండల నాయకురాలు పొడుపు కంటి సమ్మక్క ఆవిష్కరించారు అనంతరం జరిగిన మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విజయ కాలనీ ఏర్పాటు కావడానికి సిపిఎం పార్టీ గత ఎమ్మెల్యేలు కుంజ బుజ్జి సున్నం రాజయ్య వారసత్వంలో భూ పోరాటం చేసి ఇండ్లు ఏర్పాటు.చేసి ఈ కాలనీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.ఎన్నో ఏళ్ల నుంచి సిపిఎం కి శాఖ సభ్యులు పట్టుకొమ్మలా ఉన్నారని, కానీ ఇక్కడ సమస్యలు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేదని, గుట్ట మీద ఇళ్లకు ప్రతి సందుకు కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలని,మరియు సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని పైపులైను లేనిచోట పైపులైన్లు వేయాలని అన్నారు,ఇండ్ల చుట్టూ ఇష్టానుసారం కంకర తోలకాలు జరుపుతూ ఇండ్ల పునాదికి దెబ్బతీసే పరిస్థితి వస్తున్నదని విజయ కాలనీ పరిధిలో ఇండ్ల స్థలాలు పరిధిలో కంకర నిలవలను తోలకలు చేయరాదని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీ ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.
ప్రభుత్వ పథకాల ముందడుగు వేయడం లేదని ఇది సరైనదే పద్ధతి కాదని ఇందిరమ్మ అర్హులకు సత్వరమే ఇళ్ల స్థలాలు మరియు ఇందిరమ్మ ఇండ్లను వారి యొక్క స్థలాల్లో నిర్మించి ఇవ్వాలని దీనిపై ప్రకటన కూడా చేయకపోవడం సరైనది కాదని రుణమాఫీ కూడా అసంతృప్తిగా ఉన్నదని రైతులకు రైతుబంధు డబ్బులు వేయడంలో నిర్లక్ష్యం ఉన్నదని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల ఎన్నో హామీలు ఇచ్చిన అమలుకు నోచుకోవడం లేదని బిజెపి ప్రజలను మరిచిందని కార్పొరేట్ వ్యక్తులకు కను సన్నుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తున్నారని దీని ఫలితమే రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ జమిలి ఎన్నికలు తీసుకురారున్నారని ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుందని రాష్ట్ర అధికారాలు అరించిపోతాయని అన్నారు.
పత్రికా విలేకరిపై దాడిని ఖండించండి.
చర్ల మండలం పత్రికా విలేకరిపై గత మూడు రోజులుగా భయభ్రాంతులకు గురి చేస్తున్న బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ మహాసభలో వివిధ సమస్యలపై తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మచ్చ రామారావు మండల కమిటీ సభ్యులు కారం నరేష్ బందెల చంటి పొడుపుగంటి సమ్మక్క వరదల వరలక్ష్మి షారోను నాగమణి సూరమ్మ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.