★ విష జ్వరాలతో పిట్టల రాలుతున్న జనాలు
★ సరిపడా మందులు లేవు
★ ఇష్టా రీతిన వైద్య శాఖలో ట్రాన్స్ఫర్లు…. ప్రభుత్వ వైద్యశాలలలో వేధిస్తున్న సిబ్బంది కొరత
★ పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు శూన్యం
★ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్
★ పినపాక పీహెచ్సీలో రోగుల వెతలు తెలుసుకున్న టిఆర్ఎస్ బృందం
నేటి గదర్ న్యూస్,పినపాక: విష జ్వరాలు విజృంభించి ప్రజలు పిట్టలా రాలిపోతున్న ప్రజా పాలన అని ప్రకటించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం పైసలు లేకుండా పోయిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల పినపాక మండల బి ఆర్ ఎస్ బృందంతో కలిసి కోలేటి భవాని శంకర్ పినపాక పి హెచ్ సి ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో సరిపడా మందులు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఫై ఆధారపడవలసిన దుస్థితి నెలకొంది అన్నారు. రోగాల బారిన పడి ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం నిద్రమత్తు వీడి ప్రజలకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ చింతపంటి సత్యం, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాయకులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి(మెడికల్), నాసర్ రెడ్డి, చిర్ర రాములు గౌడ్, ఎన్న కాశిరెడ్డి, సయ్యద్ ఇమామ్, ఏలేటి అశోక్ రెడ్డి, గోగిరెడ్డి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.