రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 25:- మెదక్ జిల్లా నిజాంపేట మండల నూతన ఎంఈఓ గా యాదగిరి బుధవారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాంపేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు అత్యుత్తమమైన బోధనను అందించే దిశగా పాఠశాలలను బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.తనను ఎంఈఓ గా నియమించినందుకు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ కు నాతోటి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అయన తెలియపరచారు.
Post Views: 65