భద్రాచలం :
భద్రాచలం ఐటీడీఏ ఆఫీసు లో ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ని జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు వంశి తేజ ,జాతీయ బోర్డు అడ్వైజరీ మెంబర్ వేణు గోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, స్థానిక ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు మరియు అక్రమాలు గురించి చర్చించడం జరిగింది. అనంతరం పి ఓ ని శాలువా కప్పి సన్మానించారు… జాతీయ అధ్యక్షులు వంశి తేజ మాట్లాడుతూ భద్రాచలం లో త్వరలో బ్రాంచ్ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నాము మరియు ఆశక్తి ఆన్న యువతకు కౌన్సిల్ లో చేరేందుకు మంచి అవకాశం అని, చుట్టూ ప్రక్కల గ్రామాలు మరియు ఏజెన్సీ లో జరుగుతున్న అవకతవకలు , అన్యాయాలు పై అధికారులను కలిసి తాగు న్యాయం చేయడానికి ముందుకు రావాలి అని కోరారు, అలాగే వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్యాయం, అక్రమం, తప్పు చేసినా వాళ్ళు ఎంతటి వారైనా సరే చట్టబద్ధమైన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తాము అని అన్నారు.రాజాగ్యం కలిపించిన హక్కులను కాపాడాలని కోరారు. జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NHRCOI)