మహిళా సంఘాల సభ్యులు 100% అక్షరాస్యత సాధించాలి కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 25:-మెదక్ తెలంగాణ భవన్ లో మహిళా సంఘాల 7వ వార్షిక సర్వ సభ్య మహిళా వార్షికోత్సవ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా జిల్లా సమైక్య ప్రగతి పథంలో ముందుకు పోవడం శుభపరిణామమని అన్నారు.మెదక్ జిల్లాలో 13063 మహిళా సంఘాల గ్రూపులు ఉన్నాయని 2024-25 సంవత్సరంలో 214 కోట్ల రుణాలు అందించడం జరిగిందన్నారు.మహిళా సంఘాల సభ్యులు 100% అక్షరాస్యత సాధించాలని మహిళ ఆర్థిక స్వాలంబనే లక్ష్యంగా ముందుకు పోతూ సామాజిక కార్యక్రమాలు అయిన బాల్య వివాహాలు జరుగ కుండా చూడాలని వరకట్న నిషేధం జరిగేలా చూడాలన్నారు.తీసుకున్న రుణాలు వినియోగ అవసరాలకు వాడకుండా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవాలి అని వచ్చిన ఆదాయంతో వినియోగ అవసరాలు తీర్చుకోవాలన్నారు.అమ్మ ఆదర్శ పాఠశాల పనులు వివోల ద్వారా సమర్ధ వంతముగా నిర్వహించాలన్నారు.ఈ సర్వ సభ్య సమావేశంలో 2023-24 వార్షిక సంవత్సరంలో జిల్లా సమాఖ్య ద్వారా అమలు పరచిన కార్యక్రమాల నివేదిక చదివి వినిపించడం జరిగిందన్నారు.వార్షిక లెక్కలకు మరియు 2024-25 వార్షిక సంవత్సరంలో చేయబోవు ప్రణాళికకు మహాసభ ఆమోదము తెలిపిందన్నారు. అనంతరం 2023-24 వార్షిక సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన తూప్రాన్ మనోహరాబాద్,చెగుంట, నర్సాపూర్,హవేలీ ఘనపూర్, మెదక్ మండలాల అధ్యక్షురాళ్ళను మరియు సంబధిత మండల ఎపిఏంలను జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి మెమోంటో లు అందచేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి సిఎచ్ శ్రీనివాస్ రావు అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.సరస్వతి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నవనీత జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు మండల సమాఖ్యల ఆదికారులు జిల్లా సమాఖ్య సిబ్బంది పాల్గొన్నారు.