◆న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి భానోత్ ఊక్లా
నేటి గద్దర్ న్యూస్, గుండాల: ఏజెన్సీలో ఉద్యమ కిరణం పాషన్న అని న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బానోత్ఊక్లా అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం ఊక్లా మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం గోదావరి లోయ పోరాటాలలో అనేకమంది తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు. ఉమ్మడి పార్టీ కోసం ఆయన వెళ్ళలేని కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఐఎఫ్టియు జాతీయ నాయకులు బి రామ్ సింగ్ మాట్లాడుతూ కార్మికోద్యమాలలో పాషన్న పోరాటాలు విజయాలు చిరస్మనీయంగా నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. గోదావరి లోయ బొగ్గు గని కార్మికుల సంఘాన్ని విస్తరించడంలో ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, తుడుం దెబ్బ నాయకులు నరసింహారావు, నరసింహులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Post Views: 22