రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 26:- తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సగర విద్యార్థిని, విద్యార్థులకు అందించే ప్రతిభా పురస్కారాల సెలక్షన్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగర విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని రాష్ట్ర సగర సంఘం నాయకులు అన్నారు.ఇందుకు సంబంధించి జత పరచవలసిన అర్హత పత్రాలు ఎస్ఎస్ సి,ఇంటర్మీడియట్ ఎంపీసీ 970 మార్కులు,ఇంటర్మీడియట్ బైపిసి, సీఇసీ, హెచ్ఇసి,ఎంఇసి,కోర్సు పూర్తి చేసి 950 మార్కులు సాధించిన వారు అలాగే ఎంబీబీఎస్ విద్యార్థులు, పి.హెచ్.డి, డిగ్రీ,పీజీ, బీటెక్, బీఫార్మసీ, ఎంఇడి, బిఎడ్, ఐటిఐ, స్పోర్ట్స్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారు మెమో,కులము సర్టిఫికెట్,ఆధార్ కార్డు,పూర్తి చిరునామా,మొబైల్ నెంబర్,పాస్ పోర్ట్ సైజ్ ఫోటో దరఖాస్తులకు చివరి తేది పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ఈ నెల 30వ లోపు స్వీకరించడం జరుగుతుందన్నారు.ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం దసరా సెలవులలోనే తేది,సమయం, వేదిక త్వరలోనే జిల్లాల కమిటీల ద్వారా లేదా సోషల్ మీడియా వేదికగా లేదా మీరు పొందుపరుస్తున్న మీ ఫోన్ నెంబర్ల ద్వారా మీకు సమాచారం అందించడం జరుగుతుందన్నారు. ఇంకా ఇతర ఎలాంటి సందేహాలున్నా 9014868433 ఈ ఫోన్ నంబర్ కు సంప్రదించాలని సూచించారు.