మణుగూరు మండలం లో రెవెన్యూ అధికారులు,నీటి పారుదల శాఖ అధికారులు చెరువులు,కుంటలు,FTL, బఫర్ జోన్, నాలాలు, పార్కులు, నదులు, కాలువల పరిధి, ప్రభుత్వ భూములు వెంచర్లు , ఇంటి నిర్మాణానికి, ఇంటి నెంబర్లు అనుమతి ఇవ్వొద్దని మణుగూరు మున్సిపాలిటీ అధికారులు కి పంచాయతీ కార్యదర్శుల కి లిఖిత పూర్వకంగా లేఖలు రాసి ఇచ్చిన ఇంటి యజమాని ఇచ్చే డబ్బులు కూ ఆశ పడి ,లే అవుట్ లకు, చట్టం దాటి బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులిచ్చిన అధికారులను ముందు అరెస్టు చేసి, సర్వీసు నుంచి రిమూవ్ చేసి వారి ఆస్తులు, జప్తు చేసి భాదితులుకీ అందించాలి
జీవితకాల కష్టార్జితాన్ని వెచ్చించి కొనుక్కున్న సామాన్యులకు కూల్చివేతల శిక్ష ద్వారా అంతులేని వేదన మిగల్చడం సరికాదు.
భద్రాద్రి జిల్లాలో అయితే అటవీ భూముల్లో కూడా వెంచర్లు వేశారు. అమ్మారు.
కొందరు ముదుర్లు అటవీ భూమిలో భారీ భవనాలు కట్టి.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటున్నారు. వీళ్లకు శిక్ష వేయాలి.
నగరాలు, పట్టణాల్లో ఇష్టం వచ్చిన అనుమతులు
అనుమతులిచిన అధికారులకు శిక్ష వేస్తే భవిష్యత్ లో మరే అధికారీ అనుమతులు ఇవ్వరు.
దీంతో సామాన్యులు బలి కాకుండా ఉంటారు.