మెదక్ (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 27:- మెదక్ కలెక్టర్ సమీకృత కార్యాలయంలోని భవన సముదాయంలో సమావేశ హాలుకు శ్రీ జ్యోతిబాపూలే ఆడిటోరియంగా నామకరణం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రాన్ని శుక్రవారం నాడు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం,పద్మశాలి సంఘం అధ్యక్షులు జై రాములు మెదక్ జిల్లా క్రమ శిక్షణ విభాగ అధ్యక్షులు పోచమ్మల గణేష్, ప్రగతి ధర్మారం గ్రామ అధ్యక్షులు పిట్ల శ్రీశైలం,బీసీ సంఘం మండల నాయకులు శివయ్య పల్లి మాజీ సర్పంచ్ ఆర్కే మల్లేష్,పద్మశాలి సంఘం నాయకులు మద్దెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 36