రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) సెప్టెంబర్ 27:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శుక్రవారం రోజు డాక్టర్ మోహన్ నాయక్ పర్యటించారు.ఈ మేరకు రామాయంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోనాపురం వెంకటి మృతి చెందిన విషయం తెలుసుకున్న మోహన్ నాయక్ పర్యటనలో భాగంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం
అందజేశారు.అనంతరం పట్టణానికి చెందిన గాయంతి ఎల్లం.అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మోహన్ నాయక్ వారి.కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం
సుతార్ పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పున్న స్వామి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మరణ వార్త తెలుసుకున్న అయన వారి కుటుంబాన్ని పరామర్శించి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం.అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ. ఆపదలో ఉన్న పేద ప్రజలకు తనవంతు సహాయం చేస్తానని ఎటువంటి ఇబ్బందు లు ఉన్న తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు.బాధిత కుటుంబాల ప్రజలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకుంటున్న మోహన్ నాయక్ ను ఆ భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలని నిండు నూరేళ్ళు
ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు.ఈ.కార్యక్రమంలో బిఆర్ఎస్. నాయకులు గూగ్లోత్ శ్రీనివాస్ నాయక్ కాంగ్రేస్ పార్టీ నాయకులు.గుగులోత్ సురేశ్ నాయక్, కాంగ్రేస్ పార్టీ జిల్లా కార్యదర్శి బైరం కుమార్, ఎస్సీ సెల్ మండల చైర్మన్ గావు బాస్కర్,ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బైరం శంకర్ బైరం నరేష్ తదితరులు పాల్గొన్నారు.