నేటి గదర్ అరకు వాలీ (సెప్టెంబర్,29) న్యూస్:
అల్లూరి జిల్లా అరకువాలీ మండలం బస్కి పంచాయతీ దేవరపల్లి గ్రామంలో గ్రామస్తుల శ్రమాధానంతో నిర్మించిన గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ప్రహరీ మెస్సు కంచె నిర్మించారు GP స్కూల్లో ప్రభుత్వం పరహరి గోడ నిర్మించాకపోవ్వడం వలన చదువు కొనే పిల్లలకు అన్ని విధాలుగా ఆటంకాలు విషపూరితమైన పాములు తేళ్లు మొదలగు పురుగులు ఉండడం వలన పిల్లల యొక్క తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు అందరు కలిసి సమావేశం నిర్వహించడమైనది అనంతరం స్కూల్ స్థాపితమై సుమారు 50 సంవత్సరలు అయి నప్పటికి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు ఇబ్బంది కరంగా ఉంది.
కావున తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు కలిసి తమయొక్క సొంత డబ్బులాతో సుమారు 30,000 రూపాయలు కూడుకొని పాఠశాల చుట్టారా కంచె వేయడమైనది.
పై విషయం గమనించి ప్రభుత్వధికారులు మరియు నాయకులు ఈ యొక్క విషయని గమనించి Gp స్కూల్ దేవరపల్లిలో పరహరి గోడ నిర్మించ గలరని గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు కోరారు గ్రామస్తులు K.దొంబుర్డర్, P.కృష్ణ, S.రిబికా, S.మోష్య,V. నాగేష్ V. రామూర్తి తదితరులు పాల్గొన్నారు