నేటి గదర్ న్యూస్, దంతాలపల్లి:
మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలానికి చెందిన నిదానపురం అనే గ్రామంలో మాదిగలకు సంబంధించిన వారసత్వపు భూమిని వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు లాక్కోవాలని ప్రయత్నాలు చేయడం తో పాటు భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇట్టి విషయం పట్ల సంబంధిత రెవెన్యూ అధికారుల మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి చర్యలు తీసుకోకుండా, బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్ గారు మరియు సంబంధిత అధికారులు అధికారుల స్పందించాలని వెంటనే జిల్లా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పి రాష్ట్ర జిల్లా నాయకులు *రేపు* నిదానపుర గ్రామాన్ని సందర్శించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చాగంటి రమేష్ మాదిగ మాట్లాడుతూ రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లాలోని ప్రతి మాదిగ కదిలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోలేపాక ప్రవీణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఇరువు రవి మాదిగ ,గుగ్గిళ్ళ నవీన్ మాదిగ, చాగంటి రాజేష్ మాదిగ, మహేష్ మాదిగ, సంబంధిత బాధితులు పాల్గొనడం జరిగింది.